
అరిషడ్వర్గాలు అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మూవీ అరి. అరిషడ్వర్గాలులోని మొదటి రెండు పదాలైన అరి అనే టైటిల్‌తో వచ్చిన ఈ సినిమాకు మై నేమ్ ఈజ్ నోబడీ అనేది క్యాప్షన్. ఈ మూవీ అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్‌ని సంపాదించుకుంది. ఎవరూ టచ్ చేయని ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో దర్శకుడు జయశంకర్ ఈ మూవీని తెరకెక్కించారు.
అర్ వీ రెడ్డి సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి ఈ మూవీని నిర్మించారు. వినోద్ వర్మ, సూర్య, అనసూయ,సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు. ఇటీవల వచ్చిన సినిమాల్లో అరి కాస్త ముందు వరుసలో ఉందని చెప్పుకోవచ్చు.
ఇక ఈ మూవీ రిలీజ్ సందర్భంగా చికాగోలోని సినీ లాంజ్ లో మూవీ టీం సందడి చేసింది. మూవీ ప్రొడ్యూసర్ ఆర్ వీ రెడ్డి తో పాటు చికాగోలోని పలువురు ప్రముఖులు పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం టీం మెంబర్స్ అంతా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ‘అరి’ సక్సెస్ సాధించడంతో పలువురు అభినందనలు తెలిపారు. దర్శకుడు ఏడేళ్ల శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కిందని కొనియాడారు.
మనిషిలోని అంతర్గత శత్రువులను ఎలా ఎదుర్కోవాలో చెప్పే ప్రయత్నంగా అరి మూవీని తెరకెక్కించారని వివరించారు. ఇంత గొప్ప సినిమాను తెరకెక్కించిన మూవీ టీమ్ ను పలువురు ప్రశంసించారు. అరికి మంచి ప్రశంసలు లభించడం, ఆదరణ దక్కుతుండటంతో మూవీ టీంలో కొత్త ఉత్తేజం వచ్చినట్టుగా కనిపిస్తోంది.
(చదవండి: Karwa Chauth: భార్య కోసం బ్రిటిష్ వ్యక్తి కర్వా చౌత్ ఉపవాసం..! పాపం చంద్రుడి దర్శనం కోసం..)