జీజీహెచ్‌లో చిన్నారికి పునర్జన్మ
అనంతపురం మెడికల్: ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న ఓ చిన్నారికి జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రి చిన్న పిల్లల వైద్య విభాగం వైద్యులు, స్టాఫ్ నర్సులు మెరుగైన వైద్యం అందించి పునర్జనను ప్రసాదించారు. వెంటిలేటర్‌పై ఉన్న కేసును 34 రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడుతూ సాధారణ స్థితికి తీసుకువచ్చారు. వివరాలను గురువారం ఆర్‌ఎంఓ డాక్టర్ హేమలతతో కలసి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి మీడియాకు వెల్లడించారు. తీవ్ర జ్వరం, మూర్చ, దద్దుర్లతో బాధపడుతూ అపస్మారక స్థితికి చేరుకున్న తన 9 ఏళ్ల కుమార్తె వైష్ణవిని గతేడాది డిసెంబర్ 9న జీజీహెచ్‌కు కనగానపల్లి మండలం మద్దెలచెరువు గ్రామానికి చెందిన నాగేంద్ర తీసుకువచ్చాడు. ఈ కేసును సీరియస్‌గా పరిగణించిన చిన్నపిల్లల విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ రవికుమార్ నేతృత్వంలో అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ సంజీవప్ప, డాక్టర్ ప్రవీణ్‌దీన్‌కుమార్ వివిధ రక్తపరీక్షలు చేయించారు. మెదడువాపు, స్క్రబ్‌టైఫస్, సివియర్ నిమోనియాతో బాధపడుతున్నట్లుగా నిర్ధారించుకుని అత్యవసర వైద్యసేవలు మొదలు పెట్టారు. నాలుగు రోజుల పాటు పీఐసీయూలో ఉంచి వెంటిలేటర్‌పైనే చికిత్స అందించారు. రూ.7 వేలు విలువ చేసే అత్యంత ఖరీదైన మందులను అందజేస్తూ వచ్చారు. వెంటిలేటర్‌పైనే వారం రోజులపైగా వైష్ణవికి సేవలందించారు. అనంతరం సీ ప్యాప్, ఆక్సిజన్‌తో వైద్యం అందించి కోలుకున్న తర్వాత సాధారణ వార్డుకు షిప్ట్ చేశారు. రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు అయ్యే ఈ వైద్యాన్ని ఉచితంగా అందించారు. పూర్తిగా కోలుకున్న వైష్ణవిని గురువారం మీడియా సమావేశంలో ప్రవేశపెట్టారు. చిన్నారి కోలుకోవడంలో చిన్నపిల్లల విభాగంలోని వైద్యులు, స్టాఫ్‌నర్సులు అందించిన వైద్య సేవలను జీజీహెచ్ సూపరింటెండెంట్ మళ్లీశ్వరి, ఆర్‌ఎంఓ హేమలత కొనియాడారు
గతేడాది డిసెంబర్‌లో
వెంటిలేటర్‌పై ఉన్న వైష్ణవి
కోలుకున్న వైష్ణవితో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి, ఆర్‌ఎంఓ డాక్టర్ హేమలత, తదితరులు
జీజీహెచ్‌లో చిన్నారికి పునర్జన్మ


