లోకేష్ పుట్టిన రోజు వేడుకల్లో తమ్ముళ్ల రగడ
బుక్కరాయసముద్రం: మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం బీకేఎస్‌లో నిర్వహించిన వేడుకల్లో టీడీపీ నేతల మధ్య గొడవ చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని సచివాలయం వద్ద ఎమ్మెల్యే బండారు శ్రావణి వర్గీయులు, స్టేట్‌బ్యాంక్ సమీపంలో ద్విసభ్య కమిటీ వర్గీయులు వేర్వేరుగా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఇరు వర్గాల వారు టపాసులు పేలుస్తూ ర్యాలీలో పరస్పరం ఎదురు పడగానే గొడవ మొదలైంది. పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాల కార్యకర్తలను చెదరగొట్టారు.


