పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
గుంతకల్లు: స్థానిక రైల్వే జీఆర్‌పీ పరిధిలోని గుంతకల్లు–నంచర్ల రైల్వేస్టేషన్ల మధ్య హంద్రీ–నీవా కాలువ సమీపంలోని పట్టాలపై ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడు చేరుకుని పరిశీలించారు. 30 సంవత్సరాల వయసున్న మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. శరీరంపై ఎలాంటి దుస్తులు లేవు. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. రైలు ముందుకు లాక్కెళ్లడంతో ముఖం ఓ వైపు నల్లగా కందిపోయింది. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడి సంబంధీకులు ఎవరైనా ఉంటే గుంతకల్లు రైల్వే పోలీసులను సంప్రదించాలని ఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ ప్రేమ్‌కుమార్ కోరారు.


