విద్యుత్ చార్జీలపెంపు ప్రతిపాదనపై 20 నుంచి ప్రజాభిప్రా
అనంతపురం టౌన్: విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై ఈ నెల 20 నుంచి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు ఆ శాఖ ఎస్‌ఈ శేషాద్రి శేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో 2026–27 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ చార్జీల ప్రెంపు పతిపాదనలపై ఈ నెల 20న తిరుపతిలోని ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో, 22, 23 తేదీల్లో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో, 27న కర్నూలులోని ఏపీ ఈఆర్‌సీ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వినియోగదారుల నుంచి ఆయా తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30గంటల వరకు అర్జీలను స్వీకరించనున్నట్లు వెల్లడించారు.
జంబుగుంపల అడవికి నిప్పు
కుందుర్పి: కళ్యాణదుర్గం అటవీ రేంజ్ పరిధిలోని జంబుగుంపల అటవీప్రాంతం తగులబడుతోంది. ఆకతాయిలు ఎవరైనా నిప్పు పెట్టారో.. లేక ప్రమాదవశాత్తూ అగ్గి రాజుకుందో తెలియదు కానీ అడవి అగ్నికి ఆహుతవుతోందని సర్పంచ్ గంగాధర, వాల్మీకి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పాలాక్షి తెలిపారు. జంబుగుంపల అటవీ ప్రాంతం ఎనిమిది వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. శ్రీగంధం, టేకు, గాలిబుడుగు, వెదురు, జాలి, తుమ్మ తదితర విలువైన చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే రెండు వేల ఎకరాల మేర అటవీ ప్రాంతం కాలిపోయినట్లు తెలుస్తోంది. అడవుల పరిరక్షణలో అధికారుల పూర్తిస్థాయిలో విఫలమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తొండ తెచ్చిన తంటా...
● ఇంటికి నిప్పు.. బాలికకు తీవ్రగాయాలు
గుత్తి రూరల్: బేతాపల్లిలో తొండ తెచ్చిన తంటా ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవకు దారి తీసింది. ఆవేశంలో ఇంటికి నిప్పు పెట్టడంతో బాలిక తీవ్రంగా గాయపడింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు... గుత్తి మండలం బేతాపల్లికి చెందిన రామాంజనేయులు, శ్రీనివాసులు వరుసకు అన్నదమ్ములు. శుక్రవారం రాత్రి వీరు మద్యం మత్తులో ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో రామాంజనేయులు తన అన్న శ్రీనివాసులుపై తొండ విసరగా.. అది అతడి మెడను కరిచింది. తనపై చేతబడి చేసేందుకే తొండను విసిరాడని భావించిన శ్రీనివాసులు కోపంలో రామాంజనేయులు ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ఇంట్లో ఉన్న రామాంజనేయులు కుమార్తె లక్ష్మి తీవ్రంగా గాయపడగా... కుమారుడు శివ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తీవ్రంగా గాయపడిన లక్ష్మిని గుత్తి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించిన అనంతరం వైద్యుల సూచన మేరకు అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
విద్యుత్ చార్జీలపెంపు ప్రతిపాదనపై 20 నుంచి ప్రజాభిప్రా
విద్యుత్ చార్జీలపెంపు ప్రతిపాదనపై 20 నుంచి ప్రజాభిప్రా


