వలస కూలీలకు విద్యుత్ షాక్
పుట్లూరు: మండలంలోని ఓబుళాపురం సమీపంలో శుక్రవారం విద్యుత్ షాక్‌కు గురై పశ్చిమ బెంగాల్‌కు చెందిన షరీపుల్‌తో పాటు మరో ఇద్దరు జార్ఖండ్ కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. అరటి గెలలను తరలించడానికి లారీలో వెళుతున్న సమయంలో తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలు కూలీలకు తగిలాయి. క్షతగాత్రులను వెంటనే తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉన్న ఒకరిని కర్నూలులోని సర్వజనాస్పత్రికి తరలించారు. ఘటనపై తమకు ఎలాంటి సమాచారం లేదని పోలీసులు పేర్కొన్నారు.
ఇసుక అక్రమ తవ్వకాలు చేస్తే క్రిమినల్ కేసు
● గనుల శాఖ డీడీ ఆదినారాయణ
అనంతపురం టౌన్: ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా ఇసుకను తవ్వి తరలిస్తామంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని భూగర్భ గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆదినారాయణ హెచ్చరించారు. శింగనమల మండలం తరిమెలలో గురువారం అర్ధరాత్రి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న వెంటనే సిబ్బందితో కలసి అక్కడకు చేరుకుని ఇసుక తవ్వకాలకు ఉపయోగిస్తున్న హిటాచీని సీజ్ చేసినట్లు వివరించారు. పెద్దవడుగూరు మండలం చిత్రచేడు, మొలకతాళ్ల, యల్లనూరు మండలం లింగారెడ్డిపల్లి, యల్లనూరు, కనేకల్లు మండలం రచ్చుమర్రి గ్రామాల్లో ఏర్పాటు చేసిన రీచ్‌ల ద్వారానే ఇసుక తరలించుకోవాలన్నారు. అలా కాదని నిబంధనలు ఉల్లంఘించేవారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. అనంతరం సీజ్ చేసిన హిటాచీని శింగనమల పోలీసులకు అప్పగించారు.
టీడీపీ నేతల
నిర్బంధంలో
ఎకై ్సజ్ అధికారులు?
చెన్నేకొత్తపల్లి: కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన ఎకై ్సజ్ అధికారులను స్థానిక టీడీపీ నేతలో ఓ గదిలో నిర్బంధించినట్లు సమాచారం. చెన్నేకొత్తపల్లి మండలం ముష్టికోవెల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అందిన సమాచారం మేరకు... చెన్నేకొత్తపల్లి ఎకై ్సజ్ ఎస్‌ఐ శివప్రసాద్, సిబ్బంది శుక్రవారం ముష్టికోవెలలో తనిఖీలు చేపట్టారు. టీడీపీకి చెందిన ఓ వ్యక్తి నిర్వహిస్తున్న బెల్టు షాపులో కర్ణాటక మద్యం నిల్వలు గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకుని పీఎస్‌కు తరలిస్తుండగా బెల్టు షాపు నిర్వాహకుడితో పాటు గ్రామంలోని టీడీపీ నేతలు తిరగబడ్డారు. పట్టుబడిన మద్యాన్ని తీసుకెళ్లకువండా, ఎకై ్సజ్ అధికారులను గ్రామ పొలిమేరలు దాటకుండా నిర్బంధించారు. నాలుగు గోడల మధ్య దుప్పటి పంచాయితీ నిర్వహించారు. పట్టుబడిన మద్యాన్ని చివరకు కూడా అక్కడే వదిలేయడంతో ఎకై ్సజ్ అధికారులను వదిలేశారు. ఈ ఘటనపై ఎకై ్సజ్ ఎస్‌ఐ శివకుమార్‌ను వివరణ కోరగా.. గ్రామంలో తనిఖీలు చేపట్టిన మాట వాస్తవమని, అయితే తమపై ఎవరూ తిరగబడలేదని పేర్కొన్నారు.
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
అనంతపురం సెంట్రల్: ఈ నెల 21న అనంతపురంలోని యల్లమ్మకాలనీలో చోటు చేసుకున్న వివాహిత హత్య కేసులో హతురాలి భర్తను అరెస్ట్ చేసినట్లు వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. వివరాలను శుక్రవారం ఆయన వెల్లడించారు. యల్లమ్మకాలనీలో నివాసముంటున్న లక్ష్మీ గంగ (27) ప్రవర్తనపై కొంత కాలంగా భర్త రామాంజనేయులు అనుమానాలు పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే గత బుధవారం రాత్రి భార్యతో తీవ్ర స్థాయిలో గొడవపడి కత్తితో ఆమె గొంతు కోసి ఉడాయించాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం రామాంజనేయులును అదుపులోకి తీసుకున్నారు. అనుమానంతోనే తన భార్యను హతమార్చినట్లు అంగీకరించడంతో కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు.
వలస కూలీలకు విద్యుత్ షాక్
వలస కూలీలకు విద్యుత్ షాక్
వలస కూలీలకు విద్యుత్ షాక్
వలస కూలీలకు విద్యుత్ షాక్
వలస కూలీలకు విద్యుత్ షాక్


