వైఎస్సార్‌సీపీ శింగనమల కన్వీనర్ పూల ప్రసాద్ మృతి
శింగనమల: మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్ పూల ప్రసాద్ (47) గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం అస్వస్థతకు గురి కాగానే కుటుంబసభ్యులు వెంటనే అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో సోమవారం అర్ధరాత్రి ఆయన మృతిచెందారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో శింగనమల ఎంపీటీసీగా గెలుపొందారు. మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌కు అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తరిమెల గోకుల్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు నార్పల సత్యనారాయణరెడ్డి, గువ్వల శ్రీకాంత్‌రెడ్డి తదితరులు మంగళవారం శింగనమలకు చేరుకుని ప్రసాద్ మృతదేహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండలాల కన్వీనర్లు గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, యల్లారెడ్డి, ఖాదర్‌వలి ఖాన్, మహేశ్వరరెడ్డి, శివశంకర్, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ బొమ్మన శ్రీరామిరెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు నాయక్, ఎంపీపీలు నాగేశ్వరరావు, భూమిరెడ్డి రాఘవ రెడ్డి, జెడ్పీటీసీలు భాస్కర్, భాస్కర్‌రెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాలు, నాయకులు వీరాంజనేయులు, బండ్లపల్లి ప్రతాప్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనరు సాకే హరి, కాంగ్రెస్ నేత దాదా గాంధీ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సోమర జయచంద్రనాయుడు, పలువురు ఎంపీటీసీ, సర్పంచులు ఉన్నారు. మంగళవారం ఆయన అంత్యక్రియలను శింగనమలలో అశ్రునయనాలతో నిర్వహించారు.
గుండెపోటుతో ఆదివారం
అనంతపురంలోని ప్రైవేట్
ఆస్పత్రిలో చేరిక
పరిస్థితి విషమించి సోమవారంఅర్ధరాత్రి కన్నుమూత
స్వగ్రామంలో ముగిసిన అంత్యక్రియలు
వైఎస్సార్‌సీపీ శింగనమల కన్వీనర్ పూల ప్రసాద్ మృతి


