●అధినేతతో భేటీ
ఉరవకొండ: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆ పార్టీ పీఏసీ సభ్యుడు, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి మంగళవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వై.ప్రణయ్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న ఉన్నారు.
చేనేత చట్టం ఉల్లంఘనపై కేసు నమోదు
ధర్మవరం అర్బన్: చేనేత రిజర్వేషన్ చట్టాన్ని ఉల్లంఘించిన పవర్ లూమ్స్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు ధర్మవరం టూ టౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. స్థానిక శారదానగర్‌లోని అక్కిలి లోకేష్ పవర్‌లూమ్స్‌లో మంగళవారం హ్యాండ్‌లూమ్ ఏడీ మంజునాథ్ తనిఖీలు చేపట్టిన సమయంలో మరమగ్గాలపై చేనేత మగ్గాలపై నేసే పట్టు చీరలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఆయన ఫిర్యాదుతో నిర్వాహకుడు లోకేష్‌పై కేసు నమోదు చేశారు.


