‘క్రైస్తవులపై దాడులు అమానుషం’
అనంతపురం కల్చరల్: రాష్ట్రంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలని పలువురు డిమాండ్ చేశారు. ఈ నెల 4న కొర్రకోడులో క్రైస్తవులపై, చర్చి వ్యాన్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ ఆదివారం సాయంత్రం నగరవీధుల్లో ఐక్య క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో కోర్టురోడ్డు గాస్పెల్‌హాలు నుంచి ఎస్‌ఐయూ చర్చి వరకు ర్యాలీ జరిగింది. వైఎస్సార్‌సీపీ క్రిస్టియన్ విభాగం జిల్లా అధ్యక్షుడు వైపీ బాబు, గాస్పల్‌హాల్ సంఘ కాపరి వరప్రసాదరెడ్డి, వైఎస్ థామస్‌రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, వైఎస్సార్ కడప జిల్లా నుంచి విచ్చేసిన పాస్టర్ అభినయ్, సీఎస్‌ఐ రాయలసీమ డయాసిస్ ఉపాధ్యక్షుడు డాక్టర్ బెన్‌హర్‌బాబు, పాస్టర్లు జాన్ విజయ్‌కుమార్, మోసెస్ అనిల్‌కుమార్, మనుష్యే, రెడ్డివారి నెహమ్యా నాగరాజు తదితరులు మాట్లాడారు. దాడి చేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడడంతో వారు యథేచ్ఛగా తిరుగుతున్నారని, ఈ చర్యల కారణంగా మరోసారి దాడి జరగదన్న గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికై నా మతోన్మాదులను కఠినంగా శిక్షించి, ప్రత్యేక జీఓ ద్వారా క్రైస్తవులకు రక్షణ కల్పించాలని డిమాండు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తమ ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గాస్పెల్ హాలు ప్రతినిధులు ఆదినారాయణ, హెరాల్డ్, దేవవరం, ప్రసాదు, ఆప్సా, డేనియల్, బైబిల్ మిషన్ బందెల రాజు, విజయకుమారి, గుత్తి చర్చి నుండి విచ్చేసిన జాకోబు, సాల్మన్‌రాజ్, అబ్రహాం, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి జానీ, బ్రదర్ సతీష్, చర్చి సంఘాల ప్రతినిధులు, పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఏఐసీసీ, ఏఐసీఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు.


