మానవతకు ప్రతిరూపం హాస్యం
అనంతపురం: మానవత్వానికి, సాత్వికతకు హాస్యం ప్రతీకగా నిలుస్తుందని పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ కె.ఐ.వరప్రసాదరెడ్డి అన్నారు. హాస్య రచయిత తరిమెల అమరనాథరెడ్డి రచించిన ‘కాసేపు నవ్వుకుందాం’ పుస్తకావిష్కరణ ఆదివారం అనంతపురంలోని ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. జేవీవీ సభ్యుడు లక్ష్మీనారాయణ ‘మాయమై పోతున్నాడమ్మా.. మనిషన్నవాడు’ అంటూ ఉద్దీపన గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శాంతాబయోటిక్స్ డాక్టర్ వరప్రసాదరెడ్డి, యూపీపీఎస్సీ మాజీ సభ్యుడు డాక్టర్ వై.వెంకటరామిరెడ్డి, మానవతా కో కన్వీనర్ సలీంమాలిక్, జనప్రియ కవి ఏలూరు యంగన్న, విరసం కవయిత్రి శశికళ, తెలుగు వెలుగు సంస్థ వ్యవస్థాపకుడు టీవీరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ గుంటి మురళీకృష్ణ, అయూబ్‌ఖాన్ తదితరులు ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు. డాక్టర్ వరప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. నిత్య జీవితంలో హాస్యం ప్రాధాన్యతను వివరించారు. ఒత్తిడి నిండిన జీవితాన్ని ఆరోగ్యకరంగా మార్చుకోవడానికి నవ్వడమే దివ్య ఔషధమని అన్నారు. కార్యక్రమంలో ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డి, డాక్టర్ శాంతినారాయణ, పతికి రమేష్ నారాయణ, డిప్యూటీ మేయర్ విజయభాస్కరరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, డాక్టర్ ప్రసూన, ఎస్‌ఎస్‌బీఎన్ కరస్పాండెంట్ పీఎల్‌ఎన్ రెడ్డి, యోగా కేంద్రం అధ్యక్షుడు రాజశేఖరరెడ్డి, రైపర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మనాభ రెడ్డి, ప్రొఫెసర్ కేవీ రమణారెడ్డి, ఎస్‌ఎం బాషా, రచయితలు వెంకటేశులు, రియాజుద్దీన్, గోవిందరాజులు, నగరూరు రసూల్, జూటూరు తులసీదాసు, జగర్లపూడి శ్యామసుందరశాస్త్రి, ఆశ్రయ కృష్ణారెడ్డి, ఇంటాక్ చైర్మన్ రాంకుమార్‌రెడ్డి, వెనకబడిన ప్రాంతాల అభివృద్ది వేదిక ప్రతినిధి కేవీ రమణ, ఐఆర్‌ఎస్ విశ్రాంత అధికారి నరసింహప్ప, ఆనందభాస్కర్‌రెడ్డి, విశ్రాంత ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి, డాక్టర్ నిర్మలారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పద్మభూషణ్ అవార్డు గ్రహీత
డాక్టర్ వరప్రసాదరెడ్డి


