కేబుల్ దొంగల అరెస్ట్
యాడికి: మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయ బోరు బావులకు అమర్చిన విద్యుత్ కేబుల్‌ను అపహరించుకెళ్లిన కేసుల్లో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. యాడికి పీఎస్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను సీఐ శ్రీనివాసులు వెల్లడించారు. యాడికి మండలం చందన, రాయలచెరువు, పెద్దపేట, దైవాలమడుగు, వేములపాడు గ్రామాల్లో ఇటీవల బోరు బావులకు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ కేబుల్‌ను దుండగులు అపహరించారు. ఆయా ఘటనల్లో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం నలుగురు వ్యక్తులు రాయలచెరువులోని గుజరీ వ్యాపారి వద్ద కేబుల్, కేబుల్ కాల్చడం ద్వారా బయటపడిన రాగిని అమ్ముతుండగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వ్యవసాయ బోరు బావుల వద్ద నుంచి కేబుల్‌ను అపహరించినట్లుగా అంగీకరించారు. వీరి నుంచి 500 మీటర్ల పొడవైన కేబుల్, 30 కిలోల కాపర్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో పసుపులేటి రమేష్, నగిరి చెన్నమనాయుడు, నూతన కమలాకర్, మిడుతూరు మౌలాలీ ఉన్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కేబుల్ అపహరణ : మండలంలోని రాయలచెరువు గ్రామానికి చెందిన రైతులు ఇంటూరు ప్రసాద్ నాయుడు, సాయి నాయుడు, మధుసూదన్ నాయుడు, రంగస్వామి, చింతలకొండ, ఆర్‌పీ రమేష్, చెలంకూరు బాబు, కోనాపురం రామాంజి.. తోటల్లో వ్యవసాయ బోరుబావులకు అమర్చిన వంద మీటర్లకు పైగా కేబుల్‌ను మంగళవారం రాత్రి దుండగులు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


