ఆ స్థలాలు స్వాధీనం చేసుకోండి
● అధికారులకు ఎమ్మెల్యే గుమ్మనూరు ఆదేశం
గుంతకల్లు రూరల్ : నిరుపేదల సొంతింటి కల సాకారాన్ని సాక్షాత్తూ నియోజకవర్గ ప్రజాప్రతినిధే భగ్నం చేయడానికి పూనుకున్నారు. తనకు కావలసిన వారికి లబ్ధి చేకూర్చేందుకు పేదలపై కక్ష కట్టారు. వైఎస్సార్‌సీపీ హయాంలో శ్రీనవరత్నాలు – పేదలందరికీ ఇళ్లుశ్రీ కింద గుంతకల్లు మండలంలో అర్హులైన వారికి నివేశన స్థలాలు మంజూరు చేశారు. పక్కాగృహాలు మంజూరు చేశారు. అయితే కొందరు పేదలు పునాదులు వేసుకున్నారు. మరికొందరు ఆర్థిక శక్తి లేక నిదానంగా ఇల్లు నిర్మించుకుందామనుకున్నారు. ఇంతలో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరింది. అప్పట్లో లబ్ధి పొందిన వారి పొట్టకొట్టి.. అధికార టీడీపీకి చెందిన వారికి ఆ స్థలాలను కట్టబెట్టేందుకు ప్రస్తుత ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నిర్మాణాలు చేపట్టని లబ్ధిదారుల ఇళ్లను రద్దు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపట్టాలని ఆదేశించారు. ఈ పక్రియను మార్చి 30లోపు పూర్తి చేయాలని అధికారులకు డెడ్‌లైన్ విధించారు. ఆ స్థలాల్లో 500 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఈ విషయం తెలిసి పేదలు ఎమ్మెల్యే తీరును తప్పు పడుతున్నారు. అధికార పార్టీ వారికి ప్రయోజనం చేకూర్చేందుకు తమ స్థలాలను పీక్కోవాలని చూడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
నిబంధనల మేరకు
కందుల కొగుగోలు
కూడేరు: ప్రభుత్వ నిబంధన మేరకు రైతుల నుంచి కందులు కొగుగోలు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి రవి ఆదేశించారు. కూడేరు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలోని వ్యవసాయ గోదాములో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన కందుల నాణ్యతను, తేమ శాతాన్ని, గ్రేడింగ్ విధానాన్ని పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కందుల కొనుగోలు చేయాలని, సకాలంలో వారికి నగదు అందేలా చూడాలని ఏజెన్సీ నిర్వాహకుడు చింతల నాయుడును ఆదేశించారు. అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్దతు ధరతో ప్రభుత్వం కందులు కొనుగోలు చేస్తోందని, రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఏఓ శుభకర్ తదితరులు పాల్గొన్నారు.
నూతన జేసీ
నేడు బాధ్యతల స్వీకరణ
అనంతపురం అర్బన్: నూతన జాయింట్ కలెక్టర్‌గా సి.విష్ణుచరణ్ బుధవారం ఉదయం 10.30 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం ఇన్‌చార్జ్ కలెక్టర్‌గానూ బాధ్యతలు తీసుకుంటారు.
మన్యుసూక్తహోమం
గుంతకల్లు రూరల్: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో మంగళవారం మన్యుసూక్త హోమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ యాగశాలలో కలశ ప్రతిష్ట గావించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య మన్యుసూక్తహోమాన్ని నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ మూర్తిని పల్లకీలో కొలువుదీర్చి ఆలయం చుట్టూ ప్రాకారోత్సవం నిర్వహించారు.
ఆ స్థలాలు స్వాధీనం చేసుకోండి
ఆ స్థలాలు స్వాధీనం చేసుకోండి
ఆ స్థలాలు స్వాధీనం చేసుకోండి


