ఎంటెక్, ఎమ్మెస్సీ ఫలితాల విడుదల
అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో నిర్వహించిన ఎంటెక్ (ఆర్–21), రెగ్యులర్, సప్లిమెంటరీ, ఎమ్మెస్సీ మూడో సెమిస్టర్ (ఆర్–21) నాలుగో సెమిస్టర్ (ఆర్–21), రెగ్యులర్, సప్లిమెంటరీ, మూక్స్ (కన్వెన్షనల్ మోడ్) ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి.నాగప్రసాద్ నాయుడు మంగళవారం విడుదల చేశారు. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ ప్రొఫెసర్ శంకర్ శేఖర్ రాజు, డాక్టర్ ఎం.అంకారావు, డాక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు.
హోరాహోరీగా రాష్ట్ర స్థాయి వృషభాల బలప్రదర్శన
పామిడి: స్థానిక కొండూరు మార్గంలో వెలసిన అంకాలమ్మ, కుంటెమ్మ జాతర సందర్భంగా మంగళవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి రాతి దూలం లాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. ఉమ్మడి అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాలకు చెందిన 13 జతల వృషభాలను రైతులు తీసుకువచ్చారు. ప్రథమ స్థానంలో శ్రీసత్యసాయి జిల్లా పులేటిపల్లి రైతు బి.భాస్కర్ వృషభాలు, ద్వితీయ స్థానంలో కర్నూలు జిల్లా రైతు వెంకటగిరి వృషభాలు, తృతీయ స్థానంలో నంద్యాల జిల్లా బేతంచెర్ల రైతు ఎం.భానుజా వృషభాలు నిలిచాయి. వీరితో పాటు అలాగే తర్వాతి ఆరు స్థానాల్లో విజేతగా వృషభాల యజమానులను అభినందిస్తూ నగదు పురస్కారాలతో నిర్వాహకులు సత్కరించారు. బుధవారం న్యూ కేటగిరి విభాగంలో వృషభాల బలప్రదర్శన ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
ఎంటెక్, ఎమ్మెస్సీ ఫలితాల విడుదల


