●వాసవీ మాతా పాహిమాం
అనంతపురం కల్చరల్: ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినం మంగళవారం అనంతపురంలోని అమ్మవారి శాలల్లో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పాతూరు అమ్మవారి శాలలో ఇన్‌చార్జ్ జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, దేవదాయశాఖ ఏడీ మల్లికార్జున ప్రసాద్, డీఆర్వో మలోల, పంపనూరు ఆలయ ఈవో బాబు, ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్ వన్నూరుస్వామి తదితరులు వాసవీమాతకు పట్టు వస్త్రాలను అధికార లాంఛనాలతో సమర్పించారు. అనంతరం అమ్మవారికి జరిగిన మహా పుష్పయాగంలో పాల్గొన్నారు. ఉదయం సుప్రభాత సేవలు, కన్యక పూజలను పండితులు జరిపించారు. ఆత్మార్పణ దిన ప్రత్యేకతను వివరించారు. అనంతరం వాసవీ మహిళా మండలి సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలతో పుష్పార్చన, సామూహిక కుంకుమార్చనతో అమ్మవారికి భక్తినీరాజనాలర్పించారు. అలాగే కొత్తూరు వాసవీమాతకు ప్రత్యేకంగా బంగారు చీర అలంకార సేవలు నిర్వహించడంతో భక్తులు బారులు తీరి దర్శించుకున్నారు. వాసవీ హోమం, మధ్యాహ్నం తీర్థప్రసాద వినియోగం, అన్నదానం జరిగాయి.
అనంతపురం కొత్తూరు అమ్మవారి శాలలో వాసవీమాత చిత్రపటం వద్ద పూజలు చేస్తున్న దృశ్యం అమ్మవారికి హారతులు ఇస్తున్న భక్తులు
●వాసవీ మాతా పాహిమాం
●వాసవీ మాతా పాహిమాం


