వైఎస్సార్‌టీఏ క్యాలెండర్ ఆవిష్కరణ
అనంతపురం: వైఎస్సార్‌టీఏ క్యాలెండర్, స్టిక్కర్ క్యాలెండర్, డైరీలను డీఈఓ ప్రసాద్‌బాబు గురువారం ఆవిష్కరించారు. వైఎస్సార్‌టీఏ జిల్లా అధ్యక్షుడు ఎస్. నాగిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవాధ్యక్షుడు అశోక్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోవింద రెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్ రాధాకృష్ణా రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట రమణప్ప, జిల్లా గౌరవాధ్యక్షుడు రవీంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు గోపాల్, సహాయ కార్యదర్శులు వెంకట్ రెడ్డి, రామకృష్ణ, కృష్ణా నాయక్, సిద్ధ ప్రసాద్, చెన్నారెడ్డి, నరేష్ , డీవైఈఓ మల్లారెడ్డి, ఏడీలు మునీర్ , శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 రోజుల ప్రోగ్రాంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను డీఈఓ దృష్టికి రు తీసుకెళ్లారు. ఉపాధ్యాయులపై ఒత్తిడి తగదని పేర్కొన్నారు.
గుంతకల్లులో భారీ చోరీ
గుంతకల్లు: స్థానిక ఆదర్శనగర్‌లోని రైల్వే విశ్రాంత ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు... ఈ నెల 20న రైల్వే విశ్రాంత ఉద్యోగి అబ్దుల్ ఖాదరీ జిలానీ తన కుమారుడు, కోడలిని బెంగళూరులో వదలడానికి వెళ్లాడు. గురువారం ఉదయం ఇంటికి వేసిన తాళం బద్ధలుగొట్టి ఉండడం గమనించిన స్థానికులు వెంటనే బెంగళూరులో ఉన్న అబ్దుల్ ఖాదరీకి ఫోన్ చేసి సమాచారం చేరవేశారు. దీంతో ఆయన బెంగళూరు నుంచి కారులో బయలుదేరి గుంతకల్లుకు చేరుకుని తన ఇంటిని పరిశీలించిన అనంతరం రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ మనోహర్, సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాస్, క్లూస్ టీం బృందం అక్కడకు చేరుకుని నిందితులు వదలి వెళ్లిన ఆధారాల కోసం గాలించారు. బెడ్‌రూమ్‌లోని బీరువాను ధ్వంసం చేసి అందులో దాచిన 21 తులాల బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి సామగ్రి అపహరణకు గురైనట్లు బాధితుడు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ఉన్నతి పథకానికి
దరఖాస్తుల స్వీకరణ
అనంతపురం టౌన్: ఉన్నతి పథకానికి సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ మేరకు డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శైలజ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్యాసింజర్ ఆటో, ఫుట్‌వేర్ షాప్, టిఫెన్ సెంటర్, ఆర్గానిక్ ఉత్పత్తుల విక్రయ తదితర యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న జిల్లాలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డ్వాక్రా మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 175 యూనిట్లను అందజేయనున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.50 వేల మేర సబ్సిడీ ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని డీఆర్‌డీఏ తరఫున రుణాన్ని అందజేయనున్నారు. ఆసక్తి ఉన్న మహిళలు మండల కేంద్రాల్లోని ఏపీఎంల వద్ద దరఖాస్తులు అందజేయాలి.
స్పెల్–బీ రాష్ట్ర స్థాయి
పోటీలకు ఎంపిక
అనంతపురం: రాష్ట్ర స్థాయి స్పెల్–బీ పోటీలకు జిల్లా విద్యార్థులు ఎంపికయ్యారు. గురువారం కడపలో జోనల్ స్థాయి పోటీలు జరిగాయి. జిల్లా స్థాయిలో ఎంపికై న విద్యార్థులు జోనల్ స్థాయి పోటీల్లో తలపడ్డారు. ఇందులో ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచిన ఆర్.నిఖిలేశ్వర్ (6వ తరగతి, ఏపీఎంఎస్, రాప్తాడు), ఎం. వెంకటలక్ష్మి (7వ తరగతి, జెడ్పీహెచ్‌ఎస్, గొడసలపల్లి). పి.నందిత (9వ తరగతి, ఎస్‌ఆర్కే మున్సిపల్ స్కూల్, గుంతకల్లు), వై.వీణామాధురి (ఇంటర్, ఏపీఎంఎస్, యల్లనూరు) రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు.
వైఎస్సార్‌టీఏ క్యాలెండర్ ఆవిష్కరణ
వైఎస్సార్‌టీఏ క్యాలెండర్ ఆవిష్కరణ


