మెరుగైన సేవలందిస్తాం
● ఉద్యోగులు జవాబుదారీగా ఉండాలి
● నూతన జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్
అనంతపురం అర్బన్: ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చూస్తామని నూతన జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ స్పష్టం చేశారు. జాయింట్ కలెక్టర్‌గా నియమితులైన ఆయన బుధవారం కలెక్టరేట్‌లోని జేసీ చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఇన్‌చార్జ్ కలెక్టర్‌గా శివ్ నారాయణ్ శర్మ నుంచి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ తన ఉద్యోగ ప్రస్థానం, ఇతర అంశాలను వివరించారు. రెవెన్యూ సమస్యను నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ క్రమంలో ముందుగా జిల్లా పరిస్థితి ఏమిటనే దానిపై అధికారులతో సమీక్షిస్తానన్నారు. జిల్లా జీడీపీ పెంచడమే లక్ష్యంగా కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ క్రమంలో ప్రైమరీ, సెండరీ, ఇలా అన్ని సెక్టార్లపైన ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. ఉద్యోగులు తమ విధి నిర్వహణలో జవాబుదారీగా ఉండాలని సూచించారు. డ్యూటీ చార్ట్ ప్రకారం పనిచేసేలా చైతన్యం చేస్తూ, వారికి ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని చెప్పారు.
జేసీకి శుభాకాంక్షలు
జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన విష్ణుచరణ్‌కు అధికారులు, ఉద్యోగులు పూలమొక్కలు, పుష్పగుచ్ఛాలు అందించి శుభకాంక్షలు తెలిపారు. అంతకు ముందు కలెక్టరేట్‌కు చేరుకున్న ఆయనకు డీఆర్‌ఓ మలోల, కలెక్టరేట్ పరిపాలనాధికారి అలెగ్జాండర్, సూపరింటెండెంట్లు వసంత లత, యుగేశ్వరిదేవి, రియాజుద్ధీన్, దేవదాయ శాఖ ఏసీ మల్లికార్జున స్వాగతం పలికారు. జేసీకి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఎఫ్‌ఎస్‌ఓ రామకృష్ణారెడ్డి, ఎస్‌డీసీ ఆనంద్, ఆర్డీఓ కేశవనాయుడు, సీపీఓ అశోక్‌కుమార్, డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జునరెడ్డి, ఎన్‌టీఆర్ వైద్యసేవ జిల్లా కో–ఆర్డినేటర్ గంగాధర్‌రెడ్డి, డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు హరికుమార్, వేణుగోపాల్, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు.


