●నిరీక్షించి.. నీరసించి
చంద్రబాబు ప్రభుత్వంలో దివ్యాంగులు అష్టకష్టాలు పడుతున్నారు. పింఛన్ రీ వెరిఫికేషన్ కోసం నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. గురువారం సర్వజనాస్పత్రికి వచ్చిన వారి కష్టాలు చెప్పనలవిగా మారాయి. పరీక్షల కోసం క్యూలో నిరీక్షించి నీరసించిపోయారు. కొందరు తమ కుటుంబీకులను లైన్‌లో నిల్చోబెట్టి ఒకచోట కూర్చుండి పోయారు. తమ పట్ల ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోందని పలువురు
మండిపడ్డారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం
సర్వజనాస్పత్రి అల్ట్రాసౌండ్ గది వద్ద
వృద్ధుల ఎదురుచూపులు
●నిరీక్షించి.. నీరసించి


