మహాసేనాయ ధీమహి..
"K… ™èl™èl$µ-Æý‡$-ÚëĶæ$ ѧýlÃõßæ Ð]l$à-õÜ-¯éĶæ$ «©-Ð]l$íßæ ‘ ™èl¯ø² çÜP…§ýl@ {ç³^ø§ýlĶæ*™Œæ ॥' A…r* ç³Ñ{™èl Ð]l*çœ$-Ð]l*-çÜ…ÌZ çÜ${º-çßæÃ-×ôæÅÔèæÓÆý‡ ÝëÓÑ$ ¯éÐ]l$çÜÃ-Æý‡×æ çßZÆð‡-†¢-´ù™ø…-¨. D {MýSÐ]l$…ÌZ Mør…-MýSÌZ çÜÓĶæ$…¿¶æ$-Ð]l#V> ÐðlÌS-íܯ]l VýS$…sìæ-MìS…§ýl çÜ${ºçßæÃ-×ôæÅ-ÔèæÓÆý‡ ÝëÓÑ$ {ºçßZÃ-™èlÞ-ÐéË$ D ¯ðlÌS 25 ¯]l$…_ A…VýS-Æý‡…VýS OÐðl¿ýæ-Ð]l…V> {´ëÆý‡…¿ýæ… M>¯]l$-¯é²Æ‡$$.
గార్లదిన్నె: ఏటా మాఘమాసంలో గార్లదిన్నె మండలం కోటంక గ్రామంలో వెలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను నేత్రపర్వంగా నిర్వహిస్తుంటారు. నాలుగు వారాల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో వేలాది భక్తుల నడుమ ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకూ ఉత్సవాలను నేత్ర పర్వంగా నిర్వహించనున్నారు. జిల్లా నలుమూలల నుంచే కాక కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు.
ఆలయ విశిష్టత ఇలా..
కోటంక గ్రామంలో వెలసిన గుండు కింద సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం చుట్టూ 16 కిలో మీటర్ల మేర ప్రకృతి అందాలు కనువిందు చేస్తుంటాయి. స్వయంభువుగా స్వామి వారు ఇక్కడ వెలిసినట్లుగా ఆలయ చరిత్ర చెబుతోంది. మూలవిరాట్ ఉన్న గుండు కింద ఓ కోనేరులో నీరు ఎల్లప్పుడూ ఉంటోంది. ఈ నీటిని సేవిస్తే సకల రోగాలు నయమవుతాయని, ఆ నీటిని తీసుకెళ్లి పొలాలపై చల్లితే పంటలు సమృద్ధిగా పండుతాయని, కుజ దోషాలు, సర్ప దోషాలతో బాధపడేవారు ఈ క్షేత్రాన్ని దర్శిస్తే ఆ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. కోనేరులో ఉన్న నీటిని ఎంత తోడినా అడుగంటకుండా ఉంటోంది. వరుసగా 9 ఆదివారాలు కానీ, 11 లేదా 16 ఆదివారాలు ఈ ఆలయాన్ని సందర్శిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు అంటున్నారు. ఆలయంలో 108 సాలగ్రామ శివలింగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆలయానికి వచ్చిన భక్తులు వీటిని స్వయంగా నీటితో అభిషేకించి తమ ఆభీష్టాలను విన్నవిస్తుంటారు. ఇక ఉత్సవాల సమయంలో ప్రతి రోజూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఉంటుంది.
కోటంక కొండల్లో వెలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం
ఆలయంలోని స్వామి మూలవిరాట్
మూలవిరాట్ గుండు కింద ఉన్న నీటి కొలను
అన్ని ఏర్పాట్లు పూర్తి
కోటంకలో గుంటికింద సుబ్రహ్మణ్యస్వామి తిరునాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. భక్తుల సౌకర్యార్థం ప్రతి ఆదివారం అన్నదానం ఉంటుంది. తిరునాల సందర్భంగా వచ్చే భక్తులకు అనంతపురం నుంచి ఆలయం వరకూ ఆర్టీసీ వారు ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు.
– ఆలయ ఈఓ ఈశ్వర్ రెడ్డి
ఉత్సవాలు ఇలా..
25న మొదటి ఆదివారం శ్రీవారి ఏకవార రుద్రాభిషేకం, సహస్ర నామార్చనతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు.
ఫిబ్రవరి 1న రెండో ఆదివారం స్వామి వారికి ఏకవార రుద్రాభిషేకం నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 7న శనివారం రాత్రి 8 నుంచి 2 గంటల వరకు రథోత్సవం ఉంటుంది.
ఫిబ్రవరి 8న మూడో ఆదివారం ఉదయం 6.30 నుంచి 8 గంటల వరకు శ్రీవల్లిదేవసేన సమేత శ్రీవారి కల్యాణోత్సవం, తిరునాల ఉంటాయి.
ఫిబ్రవరి 14న గ్రామోత్సవం నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 15న నాల్గో ఆదివారం రుద్రాభిషేకం. మహా శివరాత్రి సందర్భంగా సాలగ్రామ శివలింగాలకు విశేష పూజలు ఉంటాయి.
భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న గుంటికింద సుబ్బరాయుడు
ఈ నెల 25 నుంచి కోటంకలో సుబ్రహ్మణ్యేశ్వరుడి బ్రహ్మోత్సవాలు
ఫిబ్రవరి 7న రథోత్సవం
8న కల్యాణోత్సవం
మహాసేనాయ ధీమహి..
మహాసేనాయ ధీమహి..


