అనంతపురం: టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు గంగారామ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాలో టీడీపీ నేత గంగారామ్‌ను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల అనంతపురంలో ఎగ్జిబిషన్ నిర్వాహకులుపై దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించి గంగారామ్‌పై కేసు నమోదైంది.
అదే సమయంలో నంబూరి వైన్స్‌కు గంగారాం, ఆయన అనుచరులు నిప్పుపెట్టారు. ఇలా గంగారామ్‌పై మూడు కేసులు నమోదయ్యాయి. దగ్గుపాటి ప్రసాద్ ఆదేశాలతో గంగారామ్ సెటిల్‌మెంట్లు చేస్తున్నాడు. అయితే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌పై కేసు నమోదుకు పోలీసులు వెనకడుగు వేస్తున్నారు. దగ్గుపాటిపై కేసు నమోదు ేచేయకుండా ప్రభుత్వ పెద్దల ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి:
మరో వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గపాటి ప్రసాద్


