మంత్రి సవిత అనుచరుల ‘వంక’రబుద్ధి! | TDP Leaders Land Grabbing in Sri Satya Sai district | Sakshi
Sakshi News home page

మంత్రి సవిత అనుచరుల ‘వంక’రబుద్ధి!

Mar 10 2026 5:18 AM | Updated on Mar 10 2026 5:18 AM

TDP Leaders Land Grabbing in Sri Satya Sai district

శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్‌ వద్ద బాధిత రైతులు

దళితుల భూముల్లో పాగా 

వంక పొరంబోకు భూమిని రెండు సార్లు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వైనం  

1970 నుంచి దళితుల సాగులోనే భూములు.. పట్టించుకోని అధికారులు 

శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌కు బాధితుల ఫిర్యాదు

పుట్టపర్తి అర్బన్‌: రాష్ట్ర మంత్రి సవిత అనుచరులు మరోమారు తమ వంకర బుద్ధిని చూపించారు. తాతల కాలం నుంచి దళితుల సాగులో ఉన్న భూములపై కన్నేశారు. సదరు భూముల్లోకి దళితులను రానీయకుండా అడ్డుకుంటున్నారు. దీంతో పలువురు బాధిత రైతులు సోమవారం పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్‌కు వచ్చి కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారు తెలిపిన మేరకు.. శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండలం రొద్దకంపల్లి  గ్రామ సమీపంలో సర్వే నంబర్‌ 97లో 16.80 ఎకరాల భూమి ఉంది.  ఇందులో అంగజాలవారి కుంట 8.80 ఎకరాలు పోను తక్కిన భూమి 8 ఎకరాలను ఎస్సీ కాలనీకి చెందిన 8 రైతు కుటుంబాలు 1970 నుంచి సాగు చేసుకుంటున్నాయి.

గతంలో చాలాసార్లు పట్టాల కోసం దరఖాస్తు చేసినా అధికారులు ఇవ్వలేదు. సదరు భూమి వంక పోరంబోకు కింద ఉన్నందున పట్టాలు మంజూరు చేయలేమని రెవెన్యూ అధికారులు చెబుతూ వచ్చారు. అయితే.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ భూములపై కన్నేసిన  మంత్రి అనుచరులు కొందరు దొంగ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

భూమితో ఏమాత్రమూ సంబంధంలేని రాప్తాడు మండల కేంద్రానికి చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తి దొంగ పత్రాలు పుట్టించి పెనుకొండకు చెందిన దరపతినేని రామలింగప్ప, ఆత్మకూరు మండలం గొరిదిండ్ల గ్రామానికి చెందిన వెంకటనారాయణచౌదరి అనే వారికి నంద్యాల జిల్లా బనగానపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేయించాడు. తమకు పట్టాలు మంజూరు చేయమంటే ఏళ్లుగా పట్టించుకోని అధికారులు ఇప్పుడు వారికి రిజి్రస్టేషన్‌ ఎలా చేశారని బాధిత రైతులు ప్రశి్నంచారు. కలెక్టర్‌ స్పందించి తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు సుబ్బమ్మ, లక్ష్మీనరసమ్మ, సిద్దమ్మ, రామాంజనమ్మ, లక్షి్మదేవమ్మ, వడిశలమ్మ, నరసింహప్ప, మద్దిలేటి కోరారు. 

Advertisement
 
Advertisement
Advertisement