30 మంది వైద్య విద్యార్థులకు అస్వస్థత | All students stable after diarrhoea outbreak at AIIMS Mangalagiri | Sakshi
Sakshi News home page

30 మంది వైద్య విద్యార్థులకు అస్వస్థత

Mar 10 2026 5:03 AM | Updated on Mar 10 2026 5:03 AM

All students stable after diarrhoea outbreak at AIIMS Mangalagiri

మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం 

మంగళగిరి టౌన్‌: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్‌లో యూజీ విద్యార్థులు డయే­రియా బారిన పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎయిమ్స్‌లోని హాస్టల్‌లో ఉంటున్న 25–30 మంది యూజీ విద్యార్థులు 4 రోజులుగా వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో వీరు చికిత్స పొందినట్లు సమాచారం.

ఇందులో 20 మంది విద్యార్థుల్లో కొద్దిపాటి డయేరియా లక్షణాలున్నాయని, వారు ఒక్క­రోజు చికిత్స పొంది డిశ్చార్జ్‌ కాగా, మరో 9 మంది విద్యార్థులకు ఎక్కువ లక్షణాలు కనబడడంతో వారు 2 రోజుల పాటు చికిత్స పొంది డిశ్చార్జ్‌ అయినట్లు ఎయిమ్స్‌ వర్గాలు తెలిపా­యి. విద్యార్థుల నుంచి రక్త నమూనాలను సేక­రించి టెస్ట్‌లకు పంపారు. అలాగే, నీటి నమూ­నాలను సేకరించి పరీక్షల కోసం గుంటూరు­లోని ల్యాబ్‌కు పంపినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement