breaking news
AIIMS
-
‘ఎయిమ్స్’కి ఊహించని షాక్.. వైద్య సామ్రాజ్యం బీటలు!
న్యూఢిల్లీ: భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మక వైద్య సంస్థ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఢిల్లీ ప్రస్తుతం ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా రోగులకు భరోసానిచ్చే ఈ వైద్యాలయం నుండి అగ్రశ్రేణి వైద్యులు, విభాగాధిపతులు ఒకరి తర్వాత ఒకరు తప్పుకుంటున్నారు. దశాబ్దాల అనుభవం ఉన్న సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు తమ పదవులను వదులుకుని ప్రైవేట్ ఆస్పత్రుల వైపు పరుగులు తీస్తుండటం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.ఊహించని స్వచ్ఛంద విరమణలు2023- 2025 సంవత్సరాల మధ్య కాలంలో ఎయిమ్స్ ఢిల్లీకి చెందిన దాదాపు 15 మంది సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు, విభాగాధిపతులు, ప్రొఫెసర్లు తమ పదవుల నుండి స్వచ్ఛంద విరమణ (వీఆర్ఎస్)తీసుకున్నారు. వీరిలో కనీసం 13 మంది ప్రముఖ వైద్యులు తదనంతరం కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులలో చేరడం గమనార్హం. 1956లో భారతీయ విద్యార్థులకు విదేశాలకు వెళ్లకుండానే ప్రపంచ స్థాయి పీజీ వైద్య విద్యను అందించే లక్ష్యంతో స్థాపించిన ఈ సంస్థ, ఇప్పుడు తన అమూల్యమైన వైద్య నిపుణులను కోల్పోతోంది.27 ఏళ్ల బంధాన్ని తెంచుకున్న ప్రముఖ డాక్టర్ఈ వరుస నిష్క్రమణలలో అత్యంత సంచలనంగా మారిన పేరు డాక్టర్ శివ్ కుమార్ చౌదరి. ఎయిమ్స్ న్యూఢిల్లీలో కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ (సీటీవీఎస్) విభాగాధిపతిగా పనిచేసిన ఆయన, సర్వీస్ ఇంకా మిగిలి ఉండగానే 2024లో స్వచ్ఛంద విరమణ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ప్రతిష్టాత్మక సంస్థతో 27 ఏళ్ల అనుబంధాన్ని ముగించుకున్న ఆయన, ప్రస్తుతం న్యూఢిల్లీ ఓఖ్లాలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో చేరారు. ఈ నిర్ణయం వైద్య వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.నిష్క్రమణకు అసలు కారణం ఇదే!తాము ఎయిమ్స్‌ను వీడటానికి గల ప్రధాన కారణాన్ని డాక్టర్ చౌదరి బహిర్గతం చేశారు. సంస్థలో దశాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయ క్రమానుగత శ్రేణి లేదా అధికార క్రమం దెబ్బతినడమే దీనికి ముఖ్య కారణమని ఆయన పేర్కొన్నారు. తమలాంటి పలువురు సీనియర్ వైద్యులు ఎయిమ్స్ లాంటి వ్యవస్థను వదిలి వెళ్లడానికి ఈ అంతర్గత మార్పులే కారణమని ఆయన స్పష్టం చేశారు. ఈ అంతర్గత విభేదాలు సంస్థ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి.ఇది కూడా చదవండి: ముంబైపై వరుణుడి దండయాత్ర.. ఆర్థిక రాజధాని అతలాకుతలం -
‘స్కూల్ గ్యాంగ్ వార్’.. విద్యార్థి తలలోకి దిగిన బుల్లెట్!
న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని అమర్ కాలనీలో మంగళవారం సాయంత్రం జరిగిన కాల్పుల ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలను సృష్టించింది. ఒక ప్రముఖ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి, తన స్నేహితురాలితో కలిసి ఆహారం తింటుండగా, గుర్తుతెలియని వ్యక్తులు అతడి తలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బాలుడి మెదడులోకి ఒక బుల్లెట్ దూసుకుపోయినట్లు వైద్యులు గుర్తించారు.చిన్నపాటి ఘర్షణతో మొదలై..ఆహారం తీసుకుంటున్న విద్యార్థిని పక్కనే ఉన్న మరో బృందం ఉద్దేశపూర్వకంగా తాకడంతో వివాదం మొదలైంది. కొద్దిసేపు వాగ్వాదం జరిగిన తర్వాత ఆ బృందం అక్కడి నుండి వెళ్లిపోయింది. అనంతరం తిరిగి వచ్చి తుపాకీతో కాల్పులు జరపడంతో కలకలం చెలరేగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు అత్యంత సమీపం నుండి కాల్పులు జరిపి, అక్కడి నుండి పరారయ్యారు.చికిత్స కోసం ఎయిమ్స్‌కు తరలింపుకాల్పుల అనంతరం తీవ్ర రక్తస్రావం అవుతున్న బాధితుడిని వెంటనే మూల్‌చంద్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన వైద్యం కోసం అక్కడి నుండి ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం బాధితుడు మృత్యువుతో పోరాడుతున్నాడని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటన వెనుక ఉన్న నిందితులు కూడా విద్యార్థులేనని, ప్రేమ వ్యవహారమే ఈ ఘర్షణకు అసలు కారణమని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.పోలీసుల గాలింపు ముమ్మరంఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు, ఎస్హెచ్ఓ, ఏసీపీ బృందాలు ఆధారాల కోసం గాలింపు చేపట్టాయి. ఘటనా స్థలంలోని సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నిందితులు పరారీలో ఉండటంతో, వారి కోసం నగరం అంతటా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. దర్యాప్తు కొనసాగుతోంది.ఇది కూడా చదవండి: బెంగళూరులో ఎబోలా కలకలం.. ఐసోలేషన్‌కు మహిళ తరలింపు -
ఆమె ఎలా చనిపోయింది..?
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా క్రోసూరు పోలీసుస్టేషన్‌కు విచారణ నిమిత్తం వచ్చిన ఒక మహిళ తీవ్ర గాయాలపాలై మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందడం తీవ్ర చర్చకు దారితీసింది. సంబంధిత వర్గాల కథనం ప్రకారం... విడాకుల విషయంలో బాపట్ల కోర్టుకు తిరుగుతున్న క్రమంలో చీరాలకు చెందిన పల్లపు రేణుక (39)కు వెంకటేశ్వరరెడ్డి అనే కోర్టు కానిస్టేబుల్ పరిచయమయ్యాడు. మొదటి భర్త విడాకుల అనంతరం వెంకటేశ్వరరెడ్డితో రేణుక కొంతకాలం సహజీవనం చేసింది. అప్పటికే రేణుకకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రేణుకకు పిల్లలు పుట్టరనే నెపంతో కానిస్టేబుల్ వెంకటేశ్వరెడ్డి మరో మహిళను వివాహం చేసుకున్నాడు. దీంతో నాలుగేళ్లుగా ఇద్దరి మధ్య గొడవలు, కేసుల దాకా వెళ్లింది. పొన్నూరులో పనిచేస్తున్న సమయంలో ఇదే వివాదంపై సస్పెండ్ అయిన వెంకటేశ్వరరెడ్డి ప్రస్తుతం గురజాలలో విధులు నిర్వహిస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం నమోదైన కేసులో శాఖాపరమైన విచారణ నిమిత్తం మంగళవారం సాయంత్రం క్రోసూరు సీఐ సురేష్ ముందు ఇద్దరు హాజరయ్యారు. సాయంత్రం 6 గంటల సమయంలో అల్పాహారం తిన్న తరువాత రేణుకకు ఫిట్స్ రావడంతో మొదటి అంతస్తు నుంచి కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. వెంటనే మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించారు. చికిత్సపొందుతూ బుధవారం మృతి చెందింది. ఎయిమ్స్ వద్ద బంధువుల ఆందోళన రేణుక మృతిపై ఆమె బంధువులు మంగళగిరి ఎయిమ్స్ మార్చురీ వద్ద ఆందోళనకు దిగారు. రేణుకను పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్ వెంకటేశ్వరరెడ్డి కొట్టడంతోనే మరణించిందని ఆరోపించారు. రేణుక కింద పడిన వెంటనే ఎందుకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదని, మంగళగిరికి ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. కానిస్టేబుల్‌పై హత్య కేసు నమోదు చేసి శిక్షపడేలా చేయాలని డిమాండ్ చేశారు. సీఐల చర్చలతో మారిన సీన్ ఈ క్రమంలో బంధువులు, కులసంఘం నేతలతో పెదకూరపాడు, అచ్చంపేట సీఐలు చర్చించారు. మంగళగిరి ఎయిమ్స్ వేదికగా హైడ్రామా నడిచిన అనంతరం సాయంత్రానికి పోలీసులు మృతురాలి తల్లిదండ్రులు మాట్లాడుతున్న ఓ వీడియోను మీడియాకు విడుదల చేశారు. ‘రేణుకకు ఫిట్స్ ఉన్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఏం తినకపోవడం వల్ల కళ్లు తిరిగి కిందపడిపోయింది. మా బిడ్డ మృతిపై అనవసర రాద్దాంతం చేయొద్దు’ అని మృతురాలి తండ్రి చంద్రబాబు వీడియోలో పేర్కొన్నారు. ఈ మేరకు మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెదకూరపాడు పోలీసులు మీడియాకు సమాచారమిచ్చారు. -
మీ పిల్లల్లో మొబైల్ వాడకం ఎక్కువా? ఈ రిస్కూ ఎక్కువే?
న్యూఢిల్లీ, సాక్షి : ‘‘పుస్తకం హస్తభూషణం’’ అనేమాట దాదాపు మర్చిపోతున్నాం. చిన్నా పెద్దా అందరికీ మొబైలే సర్వస్వంగా మారిపోయింది. రెండేళ్లలోపు పిల్లలు అతిగా మొబైల్ ఫోన్లు వాడటం వల్ల వారిలో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ASD) వచ్చే ముప్పు పెరుగుతుందని న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) తాజా అధ్యయనం వెల్లడించింది.ఎయిమ్స్ పీడియాట్రిక్ న్యూరాలజీ విభాగం హెడ్ ప్రొఫెసర్ షెఫాలీ గులాటి మాట్లాడుతూ, పిల్లల పెంపకంలో మానవీయ కోణం చాలా ముఖ్యమని నొక్కి చెప్పారు. "ప్రతి బిడ్డకు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే హక్కు ఉంది. పిల్లల్లో ఆటిజం లక్షణాలు కనిపిస్తే, తల్లిదండ్రులు వెంటనే పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ లేదా డెవలప్మెంటల్ పీడియాట్రీషియన్‌ను సంప్రదించాలి" అని ఆమె సూచించారు.పుట్టినప్పటి నుండి 18 నెలల మధ్య కాలంలో తల్లిదండ్రులు స్క్రీన్ ఎక్స్పోజర్కు అనుమతించిన పిల్లలలో ఆటిజం మరియు ఇతర తీవ్రమైన రుగ్మతలు గణనీయంగా ఎక్కువగా ఉన్నాయని ఈ పరిశోధన పేర్కొంది. చిన్న వయస్సులోనే ఎక్కువసేపు స్క్రీన్ టైమ్ గడపడం వల్ల ఆటిజం వచ్చే ప్రమాదం పెరుగుతుందని గత అధ్యయనాలు, మెటా-విశ్లేషణలు నిరూపించాయని, అంతేకాకుండా, ఆటిజం ఉన్న పిల్లలను ఇతర పిల్లలతో పోల్చి తాము చేసిన అధ్యయనంలో, ఆటిజం ఉన్న పిల్లలు ముందుగానే, ఎక్కువ సేపు స్క్రీన్ టైమ్ వాడారని వెల్లడైందని గులాటి వివరించారు. అలాగే పిల్లలతో వ్యక్తిగత సంభాషణ ప్రాముఖ్యతను గులాటి నొక్కిచెప్పారు, “మనం పిల్లలతో వ్యక్తిగతంగా ఎంత ఎక్కువగా సంభాషిస్తే, అది అంత ముఖ్యం” అని ఆమె పేర్కొన్నారు.ఆటిజం లక్షణాలుఆటిజం వల్ల పిల్లల్లో కమ్యూనికేషన్ సమస్యలు, ప్రవర్తనా తీరుమార్పులు ఎదుగుదలలో లోపాలతో తదితర మార్పులొచ్చే అవకాశం ఉంది:మాటలు రావడం ఆలస్యం కావడం, తమ అవసరాలను వ్యక్తపరచడంలో ఇబ్బంది పడటం.కళ్ళలోకి చూసి మాట్లాడలేకపోవడం (Limited eye contact), ఇతరులతో కలవలేకపోవడం.ఒకే పనిని పదేపదే చేయడం, శబ్దాలు లేదా కాంతి పట్ల అతిగా స్పందించడం. నేర్చుకోవడంలో ఇబ్బందులు: మేధోపరమైన నైపుణ్యాల అభివృద్ధిలో అసమానతలు ఉండటం. ఇండియా గణాంకాలుఐసిఎంఆర్ (ICMR) సర్వే ప్రకారం, నగరాల్లోని 65% మంది చిన్నారులు రోజుకు 2 గంటల కంటే ఎక్కువ సమయం మొబైల్ చూస్తున్నారు.ఆటిజం వ్యాప్తి డబ్ల్యూహెచ్ఓ (WHO) అంచనాల ప్రకారం, భారతదేశంలో ప్రతి 100 మంది పిల్లల్లో ఒకరు ఆటిజం బారిన పడుతున్నారు.అవగాహన లోపం టైర్-2 నగరాల్లో దాదాపు 70% మంది తల్లిదండ్రులు మొబైల్‌ను 'డిజిటల్ బేబీసిట్టర్'గా (పిల్లలను బుజ్జగించడానికి) వాడుతున్నారు.వైద్యుల ఏమంటున్నారంటేబాల్యం అనేది మానవ సంబంధాలు, ఆటపాటలు మరియు ఇంద్రియాల ద్వారా నేర్చుకునే ప్రక్రియలతో నిండి ఉండాలి, కానీ స్క్రీన్లతో కాదు. మొబైల్ ఫోన్ల వినియోగాన్ని పరిమితం చేయాలని మరియు పిల్లల ఎదుగుదలలో ఏవైనా లోపాలు కనిపిస్తే వెంటనే వైద్య సలహా తీసుకోవాలని ఎయిమ్స్ అధ్యయనం తల్లిదండ్రులను హెచ్చరిస్తోంది. -
నాటి నర్స్.. నేటి ఆరోగ్య మంత్రి
ఢిల్లీలోని ఎయిమ్స్‌లో... నర్సుగా శిక్షణ పొందిన నిశా మెహతా. నేడు నేపాల్ ఆరోగ్య మంత్రి అయ్యారు. ఆమె పరిచయం.రాజకీయాలలోకి వచ్చిన డాక్టర్లు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో ఆరోగ్యశాఖా మంత్రులుగా పని చేయడం చూశాం. అయితే నేపాల్‌లో ఒక నర్సు కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. మార్చి 27న ప్రధాని బాలేంద్ర షా మంత్రి వర్గంలో నర్స్ నిశా మెహతా ఆరోగ్యశాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇది ఒక విశేషమైతే ఆమెకు భారత్‌తో అనుబంధం ఉండటం మరో విశేషం.ఎయిమ్స్‌లో చదువుకునినేపాల్లోని కోషిప్రాంతానికి చెందిన 39 ఏళ్ల నిశా మెహతా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో బీఎస్సీ నర్సింగ్ చదివారు. ఆ తర్వాత గ్వాలియర్ యూనివర్సిటీలో నర్సింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. తమ పూర్వవిద్యార్థిని నేపాల్ ఆరోగ్యమంత్రిగా ఎదగడం తమ సంస్థకే కాకుండా, మొత్తం నర్సింగ్ వృత్తికే ఘనతగా మారిందని ఎయిమ్స్ ఒక ప్రకటనలో తెలిపింది.మెహతా చురుకైన వ్యక్తి అని, బహుముఖ ప్రజ్ఞ గల విద్యార్థిని అని ఆమె చదువుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ లతా వెంకటేశన్ తెలిపారు. మెహతా విద్యార్థి దశలో రాజకీయంగా చురుకుగా లేనప్పటికీ నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటూ, ఆమె ఒక విశేషమైన వ్యక్తిగా కనిపించేవారని కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మంజు వత్సా గుర్తు చేసుకున్నారు. చదువు పూర్తయ్యాక నేపాల్ తిరిగి వెళ్లిన నిశా అక్కడి ధారణ్లోని బి.పి.కోయిరాల ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో క్లినికల్ నర్స్‌గా పని చేశారు. తర్వాత రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆవిర్భావం నుంచి పని చేయడం మొదలుపెట్టారు. 2022 ఎన్నికలలో పదవికి కొద్దిదూరంలో ఆగిపోయినా ఈసారి కేంద్రమంత్రి కాగలిగారు.నర్స్‌గా సామాన్యుల సమస్యలను దగ్గరి నుంచి చూడటం వల్ల జాతీయ స్థాయిలో ఆమె చేయనున్న హెల్త్ పాలసీలపై అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్‌ల విషయంలో ఆమె గట్టి మార్పు తేనున్నారని భావిస్తున్నారు. -
30 మంది వైద్య విద్యార్థులకు అస్వస్థత
మంగళగిరి టౌన్: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్‌లో యూజీ విద్యార్థులు డయేరియా బారిన పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎయిమ్స్‌లోని హాస్టల్లో ఉంటున్న 25–30 మంది యూజీ విద్యార్థులు 4 రోజులుగా వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో వీరు చికిత్స పొందినట్లు సమాచారం.ఇందులో 20 మంది విద్యార్థుల్లో కొద్దిపాటి డయేరియా లక్షణాలున్నాయని, వారు ఒక్కరోజు చికిత్స పొంది డిశ్చార్జ్ కాగా, మరో 9 మంది విద్యార్థులకు ఎక్కువ లక్షణాలు కనబడడంతో వారు 2 రోజుల పాటు చికిత్స పొంది డిశ్చార్జ్ అయినట్లు ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. విద్యార్థుల నుంచి రక్త నమూనాలను సేకరించి టెస్ట్‌లకు పంపారు. అలాగే, నీటి నమూనాలను సేకరించి పరీక్షల కోసం గుంటూరులోని ల్యాబ్‌కు పంపినట్లు సమాచారం. -
మందులకు ఏఐ సాయం.. ‘ఎయిమ్స్’ తీవ్ర హెచ్చరిక
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత చాట్బాట్లు ఇచ్చే సలహాలను గుడ్డిగా నమ్మి సొంత వైద్యం చేసుకోవద్దని ఢిల్లీలోని ‘ఎయిమ్స్’ రుమటాలజీ విభాగం అధిపతి డాక్టర్ ఉమా కుమార్ హెచ్చరించారు. ఇటీవల ఓ బాధితుడు ఏఐ చాట్‌బాట్ సలహాతో వివిధ మందులు వాడి, ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో డాక్లర్ ఈ అత్యవసర సలహా ఇచ్చారు. ‘హిందుస్థాన్ టైమ్స్’ నివేదిక ప్రకారం ఆన్లైన్ టూల్స్ ఇచ్చే సమాచారం ఆధారంగా ఆరోగ్యం విషయంలో నిర్ణయాలు తీసుకోవడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన రుజువు చేస్తున్నదని డాక్టర్ ఉమా కుమార్ సూచించారు. ఒక బాధితుడు తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతూ, డాక్టర్‌ను సంప్రదించడానికి బదులుగా.. ఒక ఏఐ టూల్ (చాట్‌బాట్) సహాయం తీసుకున్నాడు. ఆ చాట్‌బాట్ సూచించిన సాధారణ నొప్పి నివారణ మందులను దుకాణంలో కొనుగోలు చేసి వాడటం మొదలుపెట్టాడు.అయితే ఆ భాధితుని మెడికల్ హిస్టరీ వైద్య చరిత్ర గానీ, అతనికి కడుపు లేదా పేగుల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉందన్న విషయం గానీ ఆ ఏఐ వ్యవస్థకు తెలియదు. ఫలితంగా ఆ మందుల వికటించి, బాధితునికి తీవ్రమైన అంతర్గత రక్తస్రావం మొదలైంది. సాధారణ నడుము నొప్పి నివారణ కోసం బాధితుడు చేసిన ప్రయత్నం చివరకు ప్రాణాల మీదకు తెచ్చిందని డాక్టర్ ఉమా కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.వ్యాధి నిర్ధారణ అనేది కేవలం డేటాను సరిపోల్చడం కాదని, వైద్యులు రోగిని భౌతికంగా పరీక్షించడం, రక్త పరీక్షలు, స్కానింగ్‌లు చేసి, రోగి పూర్వపు ఆరోగ్య చరిత్రను పరిశీలించడం ద్వారా చికిత్సను నిర్ణయిస్తారని డాక్టర్ తెలిపారు. అయితే ఏఐ మోడల్స్ కేవలం అందుబాటులో ఉన్న డేటాలోని ప్యాట్రన్లను మాత్రమే గుర్తిస్తాయి. అవి రోగిని చూడలేవు, శరీరంలోని హెచ్చరిక సంకేతాలను గమనించలేవు. ఈ కేసులో కూడా సరైన వైద్య పరీక్షలు జరిగి ఉంటే, పేషెంట్‌కు రక్తస్రావం అయ్యేది కాదన్నారు. అలాగే ప్రమాదకరమైన మందులను వాడేవాడు కాదన్నారు.చాట్బాట్లు ఎంత నమ్మకంగా సమాచారాన్ని అందించినప్పటికీ, వాటిలో లోపాలు ఉండే అవకాశం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాట్‌జీపీటీ లాంటి ప్లాట్‌ఫామ్‌లు ఇది వైద్య సలహా కాదని సూచనలు చేస్తున్నప్పటికీ, బాధితులు అదే సరైన వైద్యమని భ్రమపడుతున్నారన్నారు. ఏఐ టూల్స్ కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమేనని, వాటిని వ్యక్తిగత వైద్య చికిత్స కోసం వాడకూడదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే, ఏఐ వాడకంపై స్పష్టమైన నిబంధనలు ఉండాలని ఎయిమ్స్ వైద్యులు కోరుతున్నారు.ఇది కూడా చదవండి: ‘అణుయుద్ధం ఆపా.. కోటి మందిని కాపాడా’ -
సీనియర్ వేధింపులకు బెస్ట్ ఎక్సలెన్స్ అవార్డు వైద్యురాలి బలి
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) భోపాల్‌లో(మధ్యప్రదేశ్) ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్యురాలు ఇక లేదు. గత 24 రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న 24 ఏళ్ల డాక్టర్ రష్మి వర్మ తుది శ్వాస విడిచింది.ఎయిమ్స్ భోపాల్‌లోని ఎమర్జెన్సీ అండ్ ట్రామా సెంటర్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వర్మ డిసెంబర్ 11న అధిక మోతాదులో ఎనస్తీషియా ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. అపస్మారక స్తితిలో ఉన్న ఆమెను భర్త అదే ఇన్స్టిట్యూట్లో చేర్చారు. అప్పటి నుండి వెంటిలేటర్ మద్దతుపై చికిత్స తీసుకుంటూ సోమవారం ఉదయం కన్నుమూసింది. ఆమె మృతదేహాన్ని ఆమె కుటుంబానికి అప్పగించామని ఎయిమ్స్ భోపాల్ అధికారి తెలిపారు. అయితే, ఈ సంఘటనపై కొనసాగుతున్న పోలీసు దర్యాప్తు కారణంగా మరిన్ని వివరాలను పంచుకోవడానికి నిరాకరించారు. ఎయిమ్స్‌లో టాక్సిక్ వర్క్ కల్చర్ ఆరోపణలు ఆమె సీనియర్ విభాగాధిపతి డాక్టర్ మొహమ్మద్ యూనస్ డా. వర్మను గత కొంతకాలంగా దీర్ఘకాలం మానసిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలున్నాయి. బలమైన ఆరోపణలున్నప్పటికీ, ఆసుపత్రి యాజమాన్యం మొదట్లో మౌనం వహించింది. అయితే బాధితురాలి ఆత్మహత్యా యత్నం, వైద్యుల సంఘాలు , పౌర సమాజం నుండి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో డాక్టర్ మొహమ్మద్ యూనస్‌ను యాజమాన్యం తన పదవి నుండి తొలగించింది. తాత్కాలికంగా అనస్థీషియా విభాగానికి అటాచ్ చేసింది. ఈ విషయంపై రహస్య విచారణ నిర్వహించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేశారు.ఆమె సహచరులు అందించిన వివరాల ప్రకారం, డాక్టర్ వర్మ డిసెంబర్ 11న తన డ్యూటీని పూర్తి చేసి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చారు. ఆమె భర్త, ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ రతన్ వర్మ, ఆమె అపస్మారక స్థితిలో ఉండగా గుర్తించి రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఆమెను ఎయిమ్స్‌కు తీసుకువచ్చారు. ఇదీ చదవండి: గ్వాలియర్‌లో దారుణం మహిళల బొమ్మల్ని కూడా .. వీడియో వైరల్గుండెపోటు , మెదడుకు నిలిచిపోయిన ఆక్సిజన్అత్యవసర విభాగానికి చేరుకునేసమయానికి ఆలస్యం జరిగిపోయింది. దాదాపు 25 నిమిషాలు కావడంతో ఆమె గుండె దాదాపు ఏడు నిమిషాలు కొట్టుకోవడం ఆగిపోయిందని వైద్యులు తెలిపారు.వెంటనే కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR) ప్రారంభించారు. మూడు రౌండ్ల పునరుజ్జీవనం తర్వాత, గుండె స్పందించింది. కానీ మెదడుకు ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కారణంగా, అప్పటికే తీవ్రమైన నాడీ సంబంధిత నష్టం జరిగింది. గుండెపోటు సమయంలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల మెదడు కణజాలానికి కోలుకోలేని నష్టం జరుగుతుందని కోలుకునే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని వైద్య నిపుణులు వివరించారు. ఆసుపత్రిలో చేరిన 72 గంటల తర్వాత నిర్వహించిన MRI స్కాన్‌లో మెదడు డ్యామేజ్, దీర్ఘకాలిక ఆక్సిజన్ కొరత ఉన్నట్లు ఆధారాలు వెల్లడయ్యాయని ఎయిమ్స్ భోపాల్ గతంలో పేర్కొంది.మంచి మనిషిని, టీచర్‌ను కోల్పోయాంఐదేళ్లకు పైగా బోధనా అనుభవంతో, ఆమె క్లినికల్ నైపుణ్యం ఆమె సొంతమని ప్రధానంగా రోగులు పట్ల చాలా దయతో ఉండేదని విద్యార్థులు సహచరులు గుర్తు చేసుకున్నారు. తన సొంత డబ్బులను రోగుల చికిత్స కోసం చెల్లించేదని కంటతడిపెట్టారు. ఆమె మరణించే సమయానికి బేసిక్ లైఫ్ సపోర్ట్ ప్రోగ్రామ్, నర్సింగ్ శిక్షణా సెషన్లకు ఇన్ఛార్జ్ ఫ్యాకల్టీగా, నోడల్ ఆఫీసర్‌గా కూడా పనిచేస్తున్నారు.ఇదీ చదవండి: 5th ఫెయిల్, రూ.12తో మొదలై రూ.12,000 కోట్ల సామ్రాజ్యంకాగా డాక్టర్ వర్మ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని MLN మెడికల్ కాలేజీ నుండి MBBS పూర్తి చేశారు. జనరల్ మెడిసిన్‌లో MD డిగ్రీ చదివారు. AIIMS భోపాల్‌లో అనేక పరిపాలనా బాధ్యతలను కూడా నిర్వహించారు. అలాగే LN మెడికల్ కాలేజీ, పీపుల్స్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (PMS), భోపాల్‌లో కూడాసేవలందించారు.ఇదీ చదవండి: మహిళల డ్రెస్సింగ్ వివాదం : రాధాకృష్ణ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం -
రిటైర్డ్ డాక్టర్ లక్ష్మీ బాయ్ రూ. 3.4 కోట్ల భారీ విరాళం
భారతదేశంలోని అత్యంత విశిష్ట గైనకాలజిస్టులలో ఒకరైన డాక్టర్ కె లక్ష్మీ బాయి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. తన జీవితకాల పొదుపు నుంచి రూ. 3.4 కోట్లను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) భువనేశ్వర్‌కు విరాళంగా ఇచ్చారు. మహిళలకు క్యాన్సర్ సంరక్షణ సేవలకు గాను ఈ విరాళాన్ని అందించారు. డిసెంబర్ 5న ఆమె 100వ పుట్టినరోజు జరుపుకోవడానికి కొన్ని రోజుల ముందు ఆమె దానం చేయడం విశేషం.100వ పుట్టిన రోజు జరుపుకోబోతున్న డాక్టర్ కె లక్ష్మీ బాయి తన జీవితాంతం పొదుపు చేసుకున్న రూ. 3.4 కోట్లను ఒడిశా, క్యాన్సర్‌తో పోరాడుతున్న మహిళల కోసం గైనకాలజికల్ ఆంకాలజీ యూనిట్‌ను నిర్మించడానికి భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు విరాళంగా ఇచ్చారు. ఈ సందర్బంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ, ఇది గైనకాలజికల్ ఆంకాలజీ కార్యక్రమాన్ని స్థాపించడంలో సహాయ పడుతుందని, భవిష్యత్ వైద్యులను రూపొందిస్తుందని, ఎంతోమంది మహిళల ఆశలను రెక్కలివ్వాలనేది తన కోరిక అని చెప్పారు. దీంతో పాటు యువతులలో క్యాన్సర్లను నివారించడంలో సహాయపడే కౌమార టీకా డ్రైవ్‌లకు మద్దతుగా డాక్టర్ బాయి బెర్హంపూర్ ప్రసూతి మరియు గైనకాలజీ సొసైటీకి రూ. 3 లక్షలు విరాళంగా ఇచ్చారు. భావ్‌నగర్‌లోని డాక్టర్ బాయి నివాసంలో ఆమె పూర్వ విద్యార్థులు కొందరు నిర్వహించే సన్మాన కార్యక్రమానికి భువనేశ్వర్‌లోని ఎయిమ్స్ వైద్యులు హాజరవుతారని భావిస్తున్నారు.యాభై సంవత్సరాలకు పైగా వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్ లక్ష్మీ బాయి తన క్లినికల్ ప్రావీణ్యం కోసం మాత్రమే కాకుండా, మహిళలకు గౌరవప్రదమైన, అందుబాటులో ఉన్న ఆరోగ్య సంరక్షణను నిర్ధారించడంలో ఆమె అచంచలమైన నిబద్ధతకు కూడా విస్తృతంగా ప్రశంసలు అందుకుంటున్నారు.1926లో డిసెంబర్ 5, జన్మించిన డాక్టర్ లక్ష్మీ బాయి, కటక్‌లోని SCB మెడికల్ కాలేజీలో మొదటి MBBS బ్యాచ్‌లో ఉన్నారు. అక్కడినుంచే ఆమె అద్భుతమైన ప్రయాణం ప్రారంభమైంది. ఆ తరువాత ఆమె మద్రాస్ మెడికల్ కాలేజీ నుండి DGO, MD (ప్రసూతి & గైనకాలజీ) పట్టాలు పుచ్చుకున్నారు. USAలోని జాన్స్ హాప్కిన్స్ హాస్పిటల్లో MPHని అభ్యసించారు. 1950లో సుందర్‌గఢ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో వృత్తిని ప్రారంభించారు. 1986లో బెర్హంపూర్‌లోని MKCG మెడికల్ కాలేజీలో O&G ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు.


