నాటి నర్స్‌.. నేటి ఆరోగ్య మంత్రి | AIIMS Delhi Alumna Nisha Mehta appointed Nepal Health Minister | Sakshi
Sakshi News home page

నాటి నర్స్‌.. నేటి ఆరోగ్య మంత్రి

Apr 1 2026 7:25 AM | Updated on Apr 1 2026 12:22 PM

AIIMS Delhi Alumna Nisha Mehta appointed Nepal Health Minister

ఢిల్లీలోని ఎయిమ్స్‌లో... 
నర్సుగా శిక్షణ పొందిన నిశా మెహతా. 
నేడు నేపాల్‌ ఆరోగ్య మంత్రి అయ్యారు. ఆమె పరిచయం.

రాజకీయాలలోకి వచ్చిన డాక్టర్లు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో ఆరోగ్యశాఖా మంత్రులుగా పని చేయడం  చూశాం. అయితే నేపాల్‌లో ఒక నర్సు కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. మార్చి 27న ప్రధాని బాలేంద్ర షా మంత్రి వర్గంలో నర్స్‌ నిశా మెహతా ఆరోగ్యశాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇది ఒక విశేషమైతే ఆమెకు భారత్‌తో అనుబంధం ఉండటం మరో విశేషం.

ఎయిమ్స్‌లో చదువుకుని
నేపాల్‌లోని కోషిప్రాంతానికి చెందిన 39 ఏళ్ల నిశా మెహతా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో బీఎస్సీ నర్సింగ్‌ చదివారు. ఆ తర్వాత గ్వాలియర్‌ యూనివర్సిటీలో నర్సింగ్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశారు. తమ పూర్వవిద్యార్థిని నేపాల్‌ ఆరోగ్యమంత్రిగా ఎదగడం తమ సంస్థకే కాకుండా, మొత్తం నర్సింగ్‌ వృత్తికే ఘనతగా మారిందని ఎయిమ్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

మెహతా చురుకైన వ్యక్తి అని, బహుముఖ ప్రజ్ఞ గల విద్యార్థిని అని ఆమె చదువుకున్న కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ లతా వెంకటేశన్‌ తెలిపారు. మెహతా విద్యార్థి దశలో రాజకీయంగా చురుకుగా లేనప్పటికీ నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటూ, ఆమె ఒక విశేషమైన వ్యక్తిగా కనిపించేవారని కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మంజు వత్సా గుర్తు చేసుకున్నారు. చదువు పూర్తయ్యాక నేపాల్‌ తిరిగి వెళ్లిన నిశా అక్కడి ధారణ్‌లోని బి.పి.కోయిరాల ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌లో క్లినికల్‌ నర్స్‌గా పని చేశారు. తర్వాత రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆవిర్భావం నుంచి పని చేయడం మొదలుపెట్టారు. 2022 ఎన్నికలలో పదవికి కొద్దిదూరంలో ఆగిపోయినా ఈసారి కేంద్రమంత్రి కాగలిగారు.

నర్స్‌గా సామాన్యుల సమస్యలను దగ్గరి నుంచి చూడటం వల్ల జాతీయ స్థాయిలో ఆమె చేయనున్న హెల్త్‌ పాలసీలపై అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ల విషయంలో ఆమె గట్టి మార్పు తేనున్నారని భావిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement