అప్పుడు నిందితుడిగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రి
ఆయనకు సీఐడీ కొమ్ముకాస్తోంది
అందుకే ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసును మూసివేస్తోంది
హైకోర్టులో పిటిషనర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయవాది శ్రవణ్ కుమార్ వాదనలు
సాక్షి, అమరావతి: ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు , మంత్రులు లోకేశ్, పొంగూరు నారాయణ తదితరులు నిందితులుగా ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్) కుంభకోణం కేసును సీఐడీ నుంచి సీబీఐకి బదలాయించాలని సోమవారం హైకోర్టుకు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ విన్నవించారు. కేసులో అప్పుడు నిందితునిగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని, ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు ముఖ్యమంత్రికి కొమ్ముకాస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కేసు మూసివేతకు ఏకంగా ఏసీబీ కోర్టులో రెఫర్డ్ చార్జిïÙట్ దాఖలు చేసిందన్నారు. అయితే ఈ వ్యాజ్యం విచారణార్హతపై సీఐడీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ అభ్యంతరం వ్యక్తంచేసిన నేపథ్యంలో ఈ అంశంపై తదుపరి వాదనలు వింటామని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు తదుపరి విచారణను న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు. అంతకు ముందు ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది శ్రవణ్ కుమార్ హైకోర్టులో చేసిన వాదనల్లో ముఖ్యాంశాలు..
n 2014–19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా, లోకేశ్, నారాయణ మంత్రులుగా ఉన్న సమయంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్, మాస్టర్ ప్లాన్‌లో అక్రమాలు జరిగాయి.
n దీనిపై సీఐడీ కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసింది. ఐదు వేల పేజీలకు పైగా ఆధారాలను సేకరించింది. ఆ మేరకు ఏసీబీ కోర్టులో చార్జిïÙట్ కూడా దాఖలు చేసింది.
n సాంకేతిక కారణాలతో ఈ చార్జిïÙట్‌ను కోర్టు వెనక్కి ఇచి్చంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మారడంతో సీఐడీ గతానికి భిన్నంగా వ్యవహరించడం మొదలుపెట్టింది.
n సీఐడీ అదనపు డీజీ ముఖ్యమంత్రి కింద
పనిచేస్తారు.
n సీఐడీ అధికారుల పదోన్నతులు, బదిలీలు అన్నీ కూడా ముఖ్యమంత్రి పర్యవేక్షణలోనే సాగుతాయి.
n అందువల్ల ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసును సీబీఐకి బదలాయించాల్సిన అవసరం ఉంది.
ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు
బదిలీ చేయాలి
కాగా, ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసును విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంలో కూడా హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.


