మళ్లీ భారీగా అప్పు తెచ్చిన చంద్రబాబు ప్రభుత్వం | Chandrababu Government Again Takes Huge Loan | Sakshi
Sakshi News home page

మళ్లీ భారీగా అప్పు తెచ్చిన చంద్రబాబు ప్రభుత్వం

Mar 10 2026 3:07 PM | Updated on Mar 10 2026 4:35 PM

Chandrababu Government Again Takes Huge Loan

చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ భారీగా అప్పు తెచ‍్చింది. ఆర్‌బీఐ సెక్యూరిటీల వేలం ద్వారా రూ.3 వేల కోట్ల అప్పు తీసుకొచ్చింది. ఇప్పటికే పరిమితికి మించి అప్పులు చేసిన బాబు ప్రభుత్వం అక్కడికీ ఆగడం లేదు. 

బడ్జెట్‌, కార్పొరేషన్ల అప్పులు రూ.3.30 లక్షల కోట్లు దాటిపోయాయి. ఈ రూ.3 వేల కోట్లతో రూ.1,82,264 కోట్లకు చేరింది బడ్జెట్‌ అప్పు. 21 నెలల్లో భారీగా బడ్జెటరీ అప్పులు తెచ్చింది బాబు సర్కార్‌. బడ్జెట్‌ బయట భారీగా అప్పులు తీసుకొస్తోంది. బాబు సర్కారు అప్పుల్లో దేశంలోనే నం.1 స్థానంలో నిలిచింది.  

మరోవైపు, ఏపీలోని రైతులు దేశంలోనే అత్యధిక అప్పుల భారాన్ని మోస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 31 నాటికి ఏపీలో రైతన్నల నెత్తిన 3,75,254 కోట్ల రూపాయల అప్పుల భారం పడింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయశాఖ పార్లమెంట్లో అధికారికంగా వెల్లడించింది. లోక్ సభలో లిఖిత పూర్వక ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు.

రైతులపై 2,01,744 కోట్ల రూపాయల పంట రుణాల భారం ఉండగా, టర్మ్ లోన్ భారం 1,73,510 కోట్ల రూపాయలగా ఉంది. మొత్తంగా రైతులపై 3,75,254 కోట్ల రూపాయల రుణ భారంగా మారింది. దేశంలోనే రైతుల రుణభారంలో రెండో స్థానంలో ఏపీ ఉంది.

రాష్ట్రాన్ని ముంచేలా చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ భారీ అప్పు

Advertisement
 
Advertisement
Advertisement