‘టీటీడీని చంద్రబాబు రాజకీయ వేదికగా వాడుకుంటున్నారు’ | YSRCP Leader Kakani Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘టీటీడీని చంద్రబాబు రాజకీయ వేదికగా వాడుకుంటున్నారు’

Mar 10 2026 11:06 AM | Updated on Mar 10 2026 12:21 PM

YSRCP Leader Kakani Slams Chandrababu Naidu

నెల్లూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల ప్రాశస్త్యం మసకబారిందన్నారు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.  టీటీడీనే స్వయంగా చంద్రబాబే రాజకీయ వేదికా వాడుకుంటున్నారని ‍ధ్వజమెత్తారు. తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. 

గో శాల, లడ్డూ, బిఆర్ నాయుడు రాసలీలు అనేక సంఘటనలు చూశాం. పరకామణీ కేసులో పెంచులయ్య 2025లో పట్టుబడ్డాడు. అతనికి బెయిల్ కూడా మంజీరా చేశారు. అదే రకమైన కేసులో రవి కుమార్ అనే నిందితుడు ఆస్తులు శ్రీవారికి రాసి ఇచ్చారు. కేసు నమోదు చేసి లోకాదలత్‌కు వెళ్ళింది..  పరకామణీ చోరి కేసులో కూటమి అధికారంలోకి వచ్చాక కేసును నీరు గార్చే ప్రయత్నాలు జరిగాయి. 

పెంచులయ్య ఎంత బంగారు చోరి చేశాడో అసలు నిజాలు బయటపెట్టలేదు. 2024 చివరిలో పెంచులయ్య చోరి చేస్తే బయటకు పొక్కకుండా చూశారు. పెంచులయ్య వెనుక ఎవరు వున్నారు. అసలు భద్రతా వ్యవస్థ పనిచేస్తుందా.. భద్రతా వైఫల్యం క్లియర్ గా కనబడుతుంది. శ్రీవారి పరకామణీలో చోరీ చేసిన నగలు కార్పొరేట్ దుకాణాల్లో మార్పిడి జరిగింది. మరీ వింతగా బ్యాంకులో శ్రీవారి నగలతో రుణాలు కూడా పొందారు.ఈ చోరీ వెనుక వున్న వారిని ఎవ్వరినీ విచారించిన పాపాన పోలేదు’ అని విమర్శించారు కాకాణి.

2025లో జరిగిన చోరీ ఇప్పటివరకూ ఎందుకు దాచారు ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement