బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి హౌస్‌ అరెస్ట్‌ | BJP Leader Vishnuvardhan Reddy Placed Under House Arrest Amid Clashes, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి హౌస్‌ అరెస్ట్‌

Mar 10 2026 8:47 AM | Updated on Mar 10 2026 12:05 PM

BJP Leader Vishnuvardhan Reddy Placed Under House Arrest

కదిరి: శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరిలో టీడీపీ-బీజేపీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. కదిరిలో ఆధిపత్యం కోంస టీడీపీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌ తంటాలు పడుతున్న నేపథ్యంలో బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డిని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో పాల్గొనేందుకు బీజేపీ నేత విష్ణువర్థన్‌కు పర్మిషన్‌ ఇవ్వలేదు.  

రథోత్సవరం పాల్గొనవద్దని బీజేపీ నేతలకు టీడీపీ ఎమ్మెల్యే హుకుం జారీ చేశారు. దాంతో ఇది కాస్తా ఆధిపత్య పోరుకు దారి తీసింది. గత కొన్నేళ్లుగా లక్ష్మీనరసింహ రథోత్సవంలో భక్తులకు విష్ణువర్థన్‌ సూచనలు చేస్తూ వస్తున్నారు. అయితే దీనికి అడ్డుకట్టవేయాలనే క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌.. ఆ ఉత్సవంలో పాల్గొనవద్దని బీజేపీ నేతలకు హుకుం జారీ చేశారు. ఒకవేళ బీజేపీ నేతలు వస్తే దాడులు చేసేందుకు టీడీపీ శ్రేణులు ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా విష్ణువర్థన్‌రెడ్డిని పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. 

వస్తే దాడి చేస్తాం.. బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి హౌస్ అరెస్ట్

Advertisement
 
Advertisement
Advertisement