గుంతకల్లు: రైల్వే మెకానికల్ విభాగంలో విధి నిర్వహణలో భాగంగా గత నెల మెరుగైన ప్రతిభ కనబరిచిన ముగ్గురికి మ్యాన్ ఆఫ్ ది మంత్ అవార్డులు దక్కాయి. వీరిలో వీఎస్ శివప్రకాష్ ఎస్‌ఎస్‌ఈ (తిరుపతి), యు.నారాయణ టెక్నీషియన్ –2 (ధర్మవరం), టి.నరసింహులు టెక్నీషియన్ –1 (కడప) ఉన్నారు. సోమవారం గుంతకల్లులోని డీఆర్‌ఎం కార్యాలయంలో అవార్డులను డీఆర్‌ఎం చంద్రశేఖర గుప్తా చేతుల మీదుగా వారు అందుకున్నారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం యు.సుధాకర్, సీనియర్ డీఎంఈ మణికుమార్, డీఎస్‌ఓ సాయి విజయ్ పాల్గొన్నారు.


