హిందూపురం బాలలు ఫుట్‌బాల్‌లో రాణిస్తున్నారు. పోటీ ఎక్కడ జరిగినా సత్తా చాటుతూ పతకాలు సాధిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి టోర్నీల్లో మెరుస్తున్నారు. ఉన్నత లక్ష్యాలను అందుకునేందుకు కఠోర సాధన చేస్తున్నారు. | - | Sakshi
Sakshi News home page

హిందూపురం బాలలు ఫుట్‌బాల్‌లో రాణిస్తున్నారు. పోటీ ఎక్కడ జరిగినా సత్తా చాటుతూ పతకాలు సాధిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి టోర్నీల్లో మెరుస్తున్నారు. ఉన్నత లక్ష్యాలను అందుకునేందుకు కఠోర సాధన చేస్తున్నారు.

Mar 10 2026 7:11 AM | Updated on Mar 10 2026 7:11 AM

హిందూపురం టౌన్‌: స్థానిక హిందూపురం యునైటెడ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ క్రీడాకారులు గెలుపునకు చిరునామాగా నిలిచారు. వరుస విజయాలను నమోదు చేస్తూ తమ సత్తా చాటుతున్నారు. తమ పలువురు జిల్లా, రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ జట్టులో దక్కించుకుని అసమాన ప్రతిభను చాటుతున్నారు.

హ్యాట్రిక్‌ విజయం

ఏటా ఆర్డీటీ ఆధ్వర్యంలో జరిగే రూరల్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ ట్రోఫీని హిందూపురం యునైటెడ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ జట్టు వరుసగా మూడు సార్లు కై వసం చేసుకుంది. ఇటీవల జరిగిన అండర్‌–12 బాలుర విభాగంలో పోటీల్లో యునైటెడ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ జట్టు ఫైనల్‌లో ఆత్మకూరు జట్టుపై 1–0 స్కోరుతో విజయం సాధించి, టోర్ని విజేతగా నిలిచింది. దీంతో వరుసగా మూడోసారి కూడా ట్రోఫీని దక్కించుకుని రికార్డు నెలకొల్పింది.

జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణింపు

2022లో ప్రారంభమైన హిందూపురం యునైటెడ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌లో కోచ్‌ బీకే మహమ్మద్‌ సలీమ్‌ ఆధ్వర్యంలో క్రీడాకారులు శిక్షణ పొందుతూ మెరికల్లా మారుతున్నారు. కోచ్‌ స్ఫూర్తితో జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించారు. క్లబ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శేఖర్‌ సహకారంతో కోచ్‌లు సలీమ్‌, వెంకటేష్‌ నేతృత్వంలో క్రీడాకారులు నిరంతర సాధనతో రాటు దేలుతున్నారు. ఇప్పటి వరకూ క్లబ్‌ తరఫున 16 మంది క్రీడాకారులు జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. అలాగే 8 మంది రాష్ట్ర జట్టులో ప్రాతినిథ్యం వహిస్తూ జాతీయ స్థాయి టోర్నీల్లో ఆడారు.

దూసుకుపోతున్న యునైటెడ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ క్రీడాకారులు

వరుసగా మూడు సార్లు ఆర్డీటీ రూరల్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ కై వసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement