మెరుగైన వైద్య సేవలు అందించండి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్య సేవలు అందించండి

Mar 10 2026 1:27 PM | Updated on Mar 10 2026 1:27 PM

ధర్మవరం అర్బన్‌: రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని వైద్య, ఆరోగ్యశాఖ జాయింట్‌ కమిషనర్‌ రమేష్‌నాథ్‌ హెచ్చరించారు. సోమవారం ఆయన పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ రిజిస్ట్రేషన్‌ రికార్డులు, వివిధ వార్డులను పరిశీలించారు. వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. మందులు బయటకు రాస్తున్నారా అంటూ ఆరా తీశారు. అనంతరం ఆస్పత్రిలోని సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి నిధులు రూ.50 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుల ఆమోదంతో చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి, ముఖ్యమైన మందుల కొనుగోలుకు ఆ నిధులను ఉపయోగించుకోవాలని సూపరింటెండెంట్‌కు సూచించారు. ఆస్పత్రిలో స్పెషలిస్ట్‌ డాక్టర్లు అందుబాటులో ఉన్నారని, రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. రోగులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్‌ తిప్పేంద్రనాయక్‌, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు ఉన్నారు.

విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే

చర్యలు తప్పవు

హెచ్చరించిన వైద్య, ఆరోగ్యశాఖ జాయింట్‌ కమిషనర్‌ రమేష్‌నాథ్‌

ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రి తనిఖీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement