సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రేపు (బుధవారం) ఉదయం 11 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై ఆయన మాట్లాడతారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.