విశాఖ: రోడ్డు పనులు చేస్తుండగా మట్టి తవ్వేకొద్దీ మృతదేహాలు బయటపడుతున్న ఘటన విశాఖలోని షీలానగర్‌లో చోటు చేసుకుంది. షీలా నగర్ రోడ్డు కనస్ట్రక్షన్ పనుల్లో భాగంగా మట్టి తవ్వుతున్న క్రమంలో డెడ్‌బాడీలు, పుర్రెలు బయటపడుతూ అది శ్మశాన వాటికను తలపిస్తూ ఉండటంతో అక్కడ కలవరం మొదలైంది. ఇప్పటివరకూ మట్టి డంపింగ్ మొత్తంగా నాలుగు డెడ్ బాడీలు, తొమ్మిది పుర్రెలు బయటపడ్డాయి.
మొదట మట్టిని తవ్వగా మగ, ఆడ డెడ్ బాడీలు కనిపించగా, ఆ తర్వాత మొత్తం మట్టిన తవ్వగా మరో రెండు డెడ్ బాడీలు, తొమ్మిది పుర్రెలు కనిపించాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దొరికిన డెడ్ బాడీలు కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో ఏం జరిగి ఉంటుంది అనేది అంతుచిక్కకుండా ఉంది. ఎవరైనా స్మశానం నుంచి తీసుకొచ్చి వేసిన మట్టి ద్వారా ఇలా డెడ్ బాడీలు వచ్చాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


