జోరుగా గ్యాస్ రీ–ఫిల్లింగ్ దందా
అనంతపురం అర్బన్: జిల్లాలో అక్రమంగా వంటగ్యాస్ రీ ఫిల్లింగ్ దందా జోరుగా సాగుతోంది. డెలివరీ బాయ్స్, వ్యాపారులు కుమ్మకై ్క గృహావసర వంటగ్యాస్‌ను పక్కదారి పట్టిస్తున్నారు. గ్యాస్ స్టవ్‌ల విక్రయాలు, రిపేరీ, చిన్న సిలిండర్ల విక్రయ దుకాణాలు ఏర్పాటు చేసుకున్న కొందరు ఆ మాటున యథేచ్ఛగా రీ–ఫిల్లింగ్ వ్యాపారం సాగిస్తున్నారు. ఈ అక్రమ వ్యాపారం జిల్లాలో నెలసరి రూ.60 లక్షలు పైగానే ఉంటోందని తెలిసింది.
మొక్కుబడిగా దాడులు
జిల్లాలో రోజూ 12,000 సిలిండర్లు డెలివరీ అవుతుంటాయి. వీటిలో దాదాపు 1,000 సిలిండర్లు పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు బహిరంగంగానే వినవస్తున్నాయి. ఫిల్లింగ్ దుకాణాల వ్యాపారులు డెలివరీ బాయ్స్‌కు రూ.200 అదనంగా ముట్టజెప్పి గృహావసర వంటగ్యాస్ 14.2 కిలోల సిలిండర్‌ను కొనుగోలు చేస్తున్నారు. అలా కొన్న సిలిండర్ నుంచి గ్యాస్‌ను చిన్న సిలిండర్లకు కిలో రూ.150తో నింపి సిలిండర్‌పై రూ.1,000 వరకు లాభం ఆర్జిస్తున్నట్లు తెలిసింది. ప్రధానంగా అనంతపురం నగరంతోపాటు జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో అక్రమంగా వంటగ్యాస్ రీ–ఫిల్లింగ్ దందా సాగుతున్నప్పటికీ అధికారులు మొక్కుబడిగా దాడులు చేస్తున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక దృష్టిసారిస్తేనే ఈ అక్రమ దందాకు అడ్డుకట్ట పడుతుందనే అభిప్రాయాలు సర్వత్రా వినవస్తున్నాయి.
బాయ్‌లకు బహుళ కనెక్షన్లు
ఏజెన్సీల్లో పనిచేస్తున్న డెలివరీ బాయ్‌లు కొందరు బహుళ కనెక్షన్లు కలిగి ఉన్నట్లు సమాచారం. కొందరు బాయ్‌లు తమ పేరున, తమ కుటుంబ సభ్యుల పేరున కనెక్షన్లు కలిగి ఉన్నట్లు తెలిసింది. ఆ కనెక్షన్ల ద్వారా సిలిండర్లను పొంది వాటిని బ్లాక్‌లో విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరు తమ రెగ్యులర్ కస్టమర్లుగా ఉన్న రీ–ఫిల్లింగ్ దుకాణాలు, హోటళ్లకు సిలిండర్ ధరపై రూ.200 అదనంగా విక్రయిస్తున్నట్లు తెలిసింది.
నగరంలోని ఒక దుకాణంలో అక్రమంగా ఉంచిన గృహావసర వంటగ్యాస్ సిలిండర్లు, గృహావసర సిలిండర్ నుంచి చిన్న సిలిండర్‌కు గ్యాస్ నింపుతున్న దృశ్యం
పక్కదారి పడుతున్న
గృహావసర సిలిండర్లు
దుకాణాల్లో యథేచ్ఛగా వ్యాపారం
జిల్లాలో రోజుకు 1,000 సిలిండర్ల అక్రమ డెలివరీ
జోరుగా గ్యాస్ రీ–ఫిల్లింగ్ దందా
జోరుగా గ్యాస్ రీ–ఫిల్లింగ్ దందా
జోరుగా గ్యాస్ రీ–ఫిల్లింగ్ దందా


