టీడీపీది దళిత వ్యతిరేక భావజాలం
● మాజీ మంత్రి శైలజానాథ్ మండిపాటు
అనంతపురం: దళిత వ్యతిరేక భావజాలంతోనే టీడీపీ ఆవిర్భవించిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత సాకే శైలజానాథ్ మండిపడ్డారు. దళితులపై దాడులు, హత్యాకాండలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. పల్నాడు జిల్లా పిన్నెల్లిలో వైఎస్సార్‌సీపీ దళిత కార్యకర్త మందా సాల్మన్ హత్యను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు ఆధ్వర్యంలో శనివారం అనంతపురంలోని బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ తన భార్యను చూసేందుకు గ్రామానికి వెళ్తున్న మందా సాల్మన్‌పై టీడీపీ గూండాలు అత్యంత కిరాతకంగా దాడి చేసి హతమార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై హత్యలు, దాడులు, అత్యాచారాల పరంపర కొనసాగుతోందని మండిపడ్డారు. పిన్నెల్లి ఘటనపై కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రపతి స్పందించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. మృతుని కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని మేయర్ వసీం డిమాండ్ చేశారు. ఎస్సీలపై దాడులు అధికమయ్యాయని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. సాల్మన్‌పై దాడి చేసిన టీడీపీ గుండాలను వెంటనే కఠినంగా శిక్షించాలని ఎస్సీ సెల్ నగర అధ్యక్షురాలు సాకే చంద్రలేఖ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, పార్టీ నగరాధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్ర, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏసీ ఎర్రిస్వామి, నాయకులు పసలూరు ఓబులేసు, మిద్దె కుళ్లాయప్ప, పామిడి ఓబులేసు, కమల్‌భూషణ్, టైలర్ వన్నూరుస్వామి, సాకే కుళ్లాయిస్వామి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జానీ, వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్ కాగజ్‌ఘర్ రిజ్వాన్ పాల్గొన్నారు. ఇంకా పార్టీ బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లా బేగ్, రాష్ట్ర కార్యదర్శి గౌస్ బేగ్, ట్రేడ్ యూనియన్ జిల్లా కార్యదర్శి అనిల్‌కుమార్ గౌడ్, మహిళా నేతలు శోభారాణి, శోభాబాయి, భారతి, ఉష, అంజలి, రాధాయాదవ్, ఇంటెలెక్చువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి కట్టుబడి తానీషా, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ శంకరయ్య, సోషల్ మీడియా నేత షేక్ బాబా సలామ్ తదితరులు పాల్గొన్నారు.


