●ప్రతి కార్యకర్తకూ వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది ●చంద్రబ
వైఎస్సార్‌సీపీ హయాంలో దేశంలోనే స్ఫూర్తిదాయక పరిపాలనతో పాటు చరిత్రలో నిలిచిపోయే రీతిలో సంక్షేమ పథకాలు అందించాం. పేదల పక్షాన, నిజమైన ప్రజాస్వామ్యం కోసం పనిచేసే మనకు గుర్తింపు ఉండాలి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అయితేనే మనకు గుర్తింపు లభిస్తుంది. కార్యకర్తల ఆలోచనలు, సూచనలు ప్రతి అంశమూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చేరేందు కోసమే డిజిటలైజేషన్ వ్యవస్థను తెచ్చాం. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ప్రతి సూచన/ సలహానూ విశ్లేషించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చేరుస్తుంది.
– నరేష్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ
అనంతపురం పార్లమెంట్ పరిశీలకుడు
మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యుడు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, చిత్రంలో
అనంత వెంకటరామిరెడ్డి, నరేష్‌కుమార్‌రెడ్డి, వజ్ర భాస్కర్‌రెడ్డి తదితరులు
వైఎస్సార్‌సీపీ అనంతపురం అర్బన్ నియోజకవర్గ స్థాయి గ్రామ–సచివాలయ స్థాయి కమిటీల సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశానికి హాజరైన పార్టీ శ్రేణులు
అనంతపురం: అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ.. అరాచకాలకు పరాకాష్టగా నిలుస్తున్న ‘రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని’ దీటుగా ఎదుర్కొందామని వైఎస్సార్‌సీపీ నాయకులు పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై అక్రమ కేసు పెట్టినా.. వేధించినట్లు ఒక్క ఫోన్ కాల్ వచ్చినా వేలాది మందిగా జగనన్న సైన్యం కదం తొక్కాలని, ప్రతి కార్యకర్తకూ అండగా నిలుద్దామని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. జనరంజక పాలన కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా పనిచేద్దామని దిశానిర్దేశం చేశారు. శనివారం అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, అర్బన్ నియోజకవర్గ సమన్వయకర్త అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి పార్టీ గ్రామ–సచివాలయ స్థాయి కమిటీల సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, అనంత పురం పార్లమెంట్ పరిశీలకుడు నరేష్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర సెక్రటరీ (ఆర్గనైజింగ్) వజ్ర భాస్కర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సాకే శైలజానాథ్, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, పార్టీ పీఏసీ సభ్యుడు మహాలక్ష్మి శ్రీనివాస్, సీఈసీ సభ్యుడు నదీం అహమ్మద్, రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్, మేయర్ వసీం సలీం, పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రరెడ్డి, డిప్యూటీ మేయర్లు దాసరి వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్‌మోహన్‌రెడ్డి, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్‌రెడ్డి, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు అశ్వత్థనాయక్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు తదితరులు పాల్గొన్నారు.
నిరాశ వద్దు.. నిలిచి గెలవాలి
‘గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీలు కుట్రలు, కుతంత్రాలు, ఈవీఎం మోసాలతో గెలిచారు. వైఎస్సార్‌సీపీకి ప్రజల్లో ఆదరణ తగ్గలేదు. అందుకు ఎన్నికల్లో వచ్చిన ఓట్లే నిదర్శనం. ఓడిపోయామని నిరాశా నిస్పృహలకు లోనుకావొద్దు’ అని వైఎస్సార్‌సీపీ టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యుడు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అనంత వెంకటరామిరెడ్డికి 83 వేల ఓట్లు వచ్చాయని, మన బలం ఎక్కడా తగ్గలేదని స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో మరింతకష్టపడి పనిచేసి, ఓటమి రుచి చూసిన చోటే ఘన విజయంతో గెలిచి వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఐకమత్యంతోనే ఇది సాధ్యమని, పార్టీ ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్విర్తించాలని అన్నారు. అందుకే ఆధార్ కార్డు తరహాలోనే పార్టీ కమిటీల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డు ఇస్తున్నామని, జగన్ 2.0లో నడిచిన ప్రతి కార్యకర్తా గుర్తుంటారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులను అడ్డు పెట్టుకుని దౌర్జన్యాలు చేయాలని కూటమి పార్టీల నేతలు చూస్తున్నారన్నారు. అక్రమ కేసులకు ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిన పోలీసులను చట్టం ముందు నిలబెడతామని భరోసా ఇచ్చారు.
ప్రతి నియోజకవర్గంలోనూ 10 వేల నుంచి 16 వేల మందితో జగనన్న సైన్యం తయారు చేస్తున్నాం. వీరందరికీ వైఎస్సార్‌సీపీ తరఫున గుర్తింపు కార్డులిస్తాం. పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడానికి కమిటీలు దోహదపడతాయి. గుర్తింపు కార్డులు ఉన్నవారికి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోను, నామినేటెడ్ పదవుల్లోనూ సముచిత స్థానాలు కల్పిస్తారు.
– వజ్ర భాస్కర్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ
రాష్ట్ర సెక్రెటరీ (ఆర్గనైజింగ్).
సలహాల కోసమే డిజిటలైజేషన్
జగనన్న సైన్యం సిద్ధం
●ప్రతి కార్యకర్తకూ వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది ●చంద్రబ
●ప్రతి కార్యకర్తకూ వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది ●చంద్రబ
●ప్రతి కార్యకర్తకూ వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది ●చంద్రబ
●ప్రతి కార్యకర్తకూ వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది ●చంద్రబ


