హోరాహోరీగా రాతి దూలం లాగుడు పోటీలు | - | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా రాతి దూలం లాగుడు పోటీలు

Jan 25 2026 7:06 AM | Updated on Jan 25 2026 7:06 AM

హోరాహ

హోరాహోరీగా రాతి దూలం లాగుడు పోటీలు

కుందుర్పి: లక్ష్మీవెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాతిదూలం లాగుడు పోటీలు, పానకం బండ్ల ఊరేగింపు నిర్వహించారు. స్థానిక హైస్కూల్‌ ప్రాంగణంలో ఉదయం 11 గంటలకు పారప్రారంభమైన రాతిదూలం లాగుడు పోటీల్లో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి 8 జతల వృషభాలు పాల్గొన్నాయి. మొదటి బహుమతి రూ.30 వేలు, రెండో బహుమతి రూ.15 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు అందించారు. సాయంత్రం పానకం బండ్ల ఊరేగింపు ఆకట్టుకుంది. మొదటి పానకం బండితో కదరంపల్లి శివారెడ్డి గ్రామోత్సవంగా వచ్చిన అనంతరం గ్రామస్తులు వచ్చి ప్రత్యేక పూజలు చేశారు.

రేపటి నుంచి బొలికొండ

రంగనాథ బ్రహ్మోత్సవాలు

గుత్తి రూరల్‌: బొలికొండ రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 26న ప్రారంభం కానున్నాయి. జక్కలచెరువు నుంచి శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథస్వామిని పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేసి, తొండపాడుకు పల్లకీలో తీసుకొస్తారు. అనంతరం ధ్వజారోహణం, అంకురార్పణ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు. 27న సింహ వాహనోత్సవం, 28న శేషవాహనోత్సవం, 29న హను మద్‌ వాహనోత్సవం, 30న గరుడ వాహనోత్సవం, 31న గజవాహనం, కల్యాణోత్సవం, ఫిబ్ర వరి 1న రథోత్సవం, 2న పార్వేట, అశ్వవాహ నం, 3న వసంతోత్సవం, హంసవాహనం జరగనుందని ఆలయ ఈఓ శోభ తెలిపారు.

విశ్వకర్మ పథకానికి దరఖాస్తు చేసుకోండి

అనంతపురం టౌన్‌: ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాసయాదవ్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఆర్థిక భరోసా కల్పించే విధంగా విశ్వకర్మ పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఏడు రోజుల నుంచి 15 రోజుల వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. టైలర్‌, చీపురు తయారీ, బార్బర్‌, వడ్రంగి, తాపీ పని, దండలు, చేపల వలలు, బొమ్మల తయారీ తదితర రంగాల్లో నైపుణ్య శిక్షణతోపాటు టూల్‌ కిట్‌ అందజేయనున్నట్లు తెలిపారు. 18 ఏళ్లు దాటిన యువతీయువకులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

అందుబాటులో

నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంపులు

అనంతపురం టౌన్‌: నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంపులను స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు అందుబాటులోకి తెచ్చారు. కొన్ని నెలలుగా స్టాంప్‌లు అందుబాటులో లేక క్రయ, విక్రయదారులు ఇబ్బందులు పడ్డారు. అధిక ధరలకు ఈ స్టాంప్‌లు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. రూ.100 స్టాంప్‌ కావాలంటే రూ.150 వరకు చెల్లించాల్సి వచ్చేది. ఎట్టకేలకు మహారాష్ట్రలోని నాసిక్‌ నుంచి జ్యుడీషియల్‌ స్టాంపులు తీసుకొచ్చారు. అనంతపురం రామ్‌నగర్‌, రూరల్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రూ.10, 20, 50, రూ.100 స్టాంప్‌లు అందుబాటులో ఉంచినట్లు జిల్లా రిజిస్ట్రార్‌ భార్గవ్‌ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో

యువకుడి మృతి

కళ్యాణదుర్గం రూరల్‌: మండలంలోని లక్ష్మీపురం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహేష్‌ (30) మృతి చెందాడు. గ్రామానికి చెందిన మహేష్‌ ద్విచక్రవాహనంపై బొట్టువానిపల్లి నుంచి లక్ష్మీపురం వైపు వెళ్తుండగా, నూతి మడుగు నుంచి కళ్యాణదుర్గం వైపు వెళ్తున్న బొలెరో ఢీకొనింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహేష్‌.. సీహెచ్‌సీకి చికిత్స నిమిత్తం తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి మహేష్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రూరల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు విద్యార్థుల ఎంపిక

వజ్రకరూరు:చిన్నహోతూరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులు జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌ఎం శ్రీనివాసరెడ్డి, పీడీ ప్రభా కర్‌ తెలిపారు. శనివారం స్థానిక పాఠశాలలో జాతీయ పోటీలకు ఎంపికయిన విద్యార్థులను అభినందించారు. ఈనెల 22న ఏలూరులో జరిగిన అండర్‌ 14 నేషనల్‌ సబ్‌ జూనియర్‌ ఖోఖో పోటీల్లో సి.అనిత (9 వ తరగతి), బి.శ్రీసూర్య (9వ తరగతి) ప్రతిభ కనబరిచి, ఆంధ్రప్రదేశ్‌ జట్టు తరఫున జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 4 వరకు హర్యానాలో జరగనున్న జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొననున్నారు. విద్యార్థులకు ఉపాధ్యాయిని పద్మజ రూ.2వేలు, సర్పంచు సుంకులమ్మ భర్త విజయ్‌కుమార్‌ రూ.1000,స్పోర్ట్స్‌ కిట్‌ అందించారు.

హోరాహోరీగా రాతి దూలం లాగుడు పోటీలు 1
1/1

హోరాహోరీగా రాతి దూలం లాగుడు పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement