డీపీఓలో సంక్రాంతి సంబరాలు
అనంతపురం సెంట్రల్: జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఎస్పీ జగదీష్, హేమ దంపతులు భోగి మంటలు వెలిగించి సంబరాలను ప్రారంభించారు. గాలిపటాలు ఎగురవేయడం, ఉట్టి కొట్టడం తదితర సాంప్రదాయ క్రీడలు ఆసక్తిగా జరిగాయి. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎస్పీ సతీమణి హేమ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారి అశ్విని మణిదీప్, ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాజ్‌బాషా, డీఎస్పీలు శ్రీనివాసరావు, నీలకంఠేశ్వరరెడ్డి, పలువురు సీఐలు, పోలీసు అధికారుల సంఘం నాయకులు పాల్గొన్నారు.
అలరించిన సంగీత విభావరి
ప్రశాంతినిలయం: సత్యసాయిని స్మరిస్తూ నిర్వహించిన సంగీత విభావరి భక్తులను మంత్ర ముగ్దులను చేసింది. బుధవారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో ప్రశాంతి నిలయం బృందావన్, నందగిరి క్యాంపస్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
నేడు సంక్రాంతి వేడుకలు
సత్యసాయి సన్నిధిలో సంక్రాంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే సత్యసాయి మహా సమాధిని ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు వేడుకల్లో పాల్గొనేందుకు ప్రశాంతి నిలయం చేరుకున్నారు. ఇటీవల నిర్వహించిన సత్యసాయి క్రీడా సాంస్కృతిక సమ్మేళనంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు సంక్రాంతి వేడుకల్లో భాగంగా బహుమతులు ప్రదానం చేయనున్నారు.
డీపీఓలో సంక్రాంతి సంబరాలు


