ప్రజా వ్యతిరేక విధానాలపై వినూత్న నిరసన
అనంతపురం: చంద్రబాబు సర్కార్ అనుసరిస్తున్న కక్షపూరిత విధానాలు, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ వినూత్న రీతిలో నిరసన తెలిపింది. వైఎస్సార్‌సీపీ నాయకులు పార్టీ జిల్లా కార్యాలయం ముందు చంద్రబాబు ప్రభుత్వం వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు తెచ్చిన జీఓ ప్రతులను భోగి మంటల్లో దహనం చేశారు. ప్రభుత్వ అహం ఈ మంటల్లో తొలగిపోవాలని నినదించారు. చంద్రబాబు నిరంకుశత్వ విధానాలతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, అగ్రవర్ణ పేదలు, మైనార్టీ విద్యార్థులు డాక్టర్ కావాలనే కలను ఛిద్రం చేసిందని ఆవేదన చెందారు. పేద విద్యార్థుల శ్రేయస్సుకు విఘాతం కలిగించే పీపీపీ జీఓను వెనక్కు తీసుకునేలా చంద్రబాబుకు దేవుడు మంచిబుద్ధి ప్రసాదించాలని పేర్కొన్నారు.
పెత్తందార్ల శ్రేయస్సుకే ప్రైవేటీకరణ
పెత్తందార్ల శ్రేయస్సు కోసమే ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు పీపీపీ విధానం తీసుకొచ్చారని చంద్రబాబు సర్కారుపై జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ ధ్వజమెత్తారు. నాణ్యమైన వైద్యవిద్యను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు అందించాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఏకంగా 17 కొత్త మెడికల్ కళాశాలలను మంజూరు చేయించారన్నారు. స్వాతంత్య్రం తరువాత ఏ రాష్ట్రంలోనూ ఒకే దఫా 17 మెడికల్ కళాశాలలు రాలేదన్నారు. రూ.5వేల కోట్లు ఖర్చు చేస్తే కళాశాలల భవన నిర్మాణ పనులు పూర్తవుతాయన్నారు. 16 నెలల కాలంలో రూ.2లక్షల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వానికి.. రూ.5వేల కోట్ల నిధులు మెడికల్ కాలేజీలకు కేటాయించలేరా అని నిలదీశారు. ఉద్దేశ పూర్వకంగానే ప్రైవేటీకరణ పేరుతో పెత్తందార్లకు రూ.లక్ష కోట్ల ప్రజల ఆస్తిని ధారాదత్తం చేసేందుకు కుట్ర పన్నారని విమర్శించారు. పార్టీ పీఏసీ సభ్యుడు మహాలక్ష్మి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీసీ రమేష్ గౌడ్, మేయర్ వసీం సలీం, డిప్యూటీ మేయర్లు దాసరి వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్ రెడ్డి, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి , జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆలమూరు శ్రీనివాస రెడ్డి, నాగన్న (న్యాయవాది) తదితరులు చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జానీ, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లా బేగ్, బూత్ విభాగం జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథరెడ్డి, దామోదర్‌రెడ్డి, ఇంటెలెక్చువల్ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ శంకరయ్య, ప్రధాన కార్యదర్శి తానీషా, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు, న్యాయవాది హనుమన్న, యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు దాదా ఖలందర్, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి, కార్యదర్శి అనిల్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఇంకా నాయకులు లక్ష్మన్న, ముక్తియార్ అహమ్మద్, గంగాధర్, రాఘవ, సురేష్, సాకే అశోక్, చెన్నారెడ్డి, రాజా, వెంకటేశ్, రమేష్ గౌడ్, వేణుగోపాల్, కోనా రాజారెడ్డి, మహిళా నాయకులు రాధాయాదవ్, భారతి, కార్పొరేటర్లు సాకే చంద్రలేఖ, కమల్ భూషణ్, శేఖర్‌బాబు, రాజేశ్వరి, ఇసాక్, రహంతుల్లా, నాయకులు సాదిక్, నాగార్జునరెడ్డి, దాదు, సాకే కుళ్లాయిస్వామి, రాధాకృష్ణ, మహబూబ్‌బీ తదితరులు పాల్గొన్నారు.
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కు తీసుకోవాలి
చంద్రబాబుకు దేవుడు మంచిబుద్ధి ప్రసాదించాలి


