ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలి
అనంతపురం:సంక్రాంతి వేళ ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆనందాలు వెల్లివిరియాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆకాంక్షించారు. మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి అని. భోగి మంటలు, రంగవల్లులు, పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానన్నారు. జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులకు ఆయన మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజలకు సంక్రాంతి
శుభాకాంక్షలు
అనంతపురం అర్బన్: జిల్లా ప్రజలకు ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. దేవుని కరుణ, కటాక్షాలు, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఇల్లూ సిరిసంపదలు తులతూగాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఆనందమయ జీవితం గడపాలని కోరుకున్నారు. పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.
జీతాలు ఇవ్వకుండానే
ఇచ్చినట్లు బిల్లులు
● డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శికి షోకాజ్ నోటీసుల జారీ
అనంతపురం ఎడ్యుకేషన్: పారిశుధ్య కార్మికులకు జీతాలు చెల్లించకుండానే చెల్లించినట్లు బిల్లులు పెట్టుకున్నారు. తప్పుడు రికార్డులతో నిధులు పక్కదారి పట్టించారు. ఎట్టకేలకు అధికారులు గుర్తించి గుంతకల్లు డిప్యూటీ ఎంపీడీఓ, నెలగొండ పంచాయతీ కార్యదర్శిలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నెలగొండ గ్రామ పంచాయతీలో 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిధులు డ్రా చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదులు అందాయి. ఈక్రమంలో ఇటీవల డీపీఓ నాగరాజునాయుడు నెలగొండ గ్రామాన్ని సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులను నిబంధనలకు విరుద్ధంగా, గ్రామ పంచాయతీ నుంచి ఆమోదం లేకుండా డ్రా చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పారిశుధ్య కార్మికులకు జీతాలు చెల్లించకుండానే చెల్లింపులు చేసినట్లు, తప్పుడు రికార్డులతో నిధులు మళ్లించినట్లు గుర్తించారు. అప్పటి పంచాయతీ కార్యదర్శి రమావత్ రమేష్ నాయక్, పర్యవేక్షణలో అలసత్వం ప్రదర్శించిన డిప్యూటీ ఎంపీడీఓ నాగభూషణకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఏడు రోజుల్లోగా హాజరై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.
ఇన్‌చార్జ్ కలెక్టర్
శివ్ నారాయణ్ శర్మ
ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలి


