పండుగ వాతావరణమే లేదు
మా చిన్నప్పుడు సంక్రాంతి అంటేనే సంబరంగా భావించేవాళ్లం. ఇంటికి కొత్త ధాన్యం చేరిక, అల్లుళ్లు, కూతుళ్లు, వారి పిల్లలు, బంధువుల రాకతో సందడిగా ఉండేది. గంగిరెద్దులు, హరిదాసు కీర్తనలు చెవికి వినసొంపుగా ఉండేవి. ఆ సంప్రదాయాలే కనుమరుగయ్యాయి. అరకొరగా చేసే పండుగ కూడా ఈ ఏడాది భారమైంది. సరైన పంటలు చేతికందక, సంక్షేమ పథకాలు దరి చేరక ఏ ఇంట చూసిన ‘సంభ్రాంతి’గా మారింది. గత ప్రభుత్వంలో ఏదో ఓ సంక్షేమం పథకం ద్వారా లబ్ధి చేకూరేది. పేదల అవసరాలు తీరేవి. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో అలాంటివేవీ కనిపించడం లేదు.
– బ్రహ్మానందరెడ్డి, కణేకల్లు మండలం


