సెపక్‌తక్రా జాతీయ జట్టు ప్రాబబుల్స్‌కు మానస | - | Sakshi
Sakshi News home page

సెపక్‌తక్రా జాతీయ జట్టు ప్రాబబుల్స్‌కు మానస

Jan 19 2026 4:27 AM | Updated on Jan 19 2026 4:27 AM

సెపక్‌తక్రా జాతీయ జట్టు ప్రాబబుల్స్‌కు మానస

సెపక్‌తక్రా జాతీయ జట్టు ప్రాబబుల్స్‌కు మానస

ఉరవకొండ: సెపక్‌తక్రా జాతీయ జట్టు ప్రాబబుల్స్‌కు గుంతకల్లుకు చెందిన విద్యార్థి మానస ఎంపికై ంది. స్పోర్ట్స్‌ అఽథారిటి ఆఫ్‌ ఇండియా, అఖిల భారత సెపక్‌తక్రా సంఘం సంయుక్తంగా నిర్వహించిన ఖేలో ఇండియా జాతీయ స్థాయి పోటీలో అద్భుత ప్రతిభ కనబరినందుకు గాను ఆమెను ఈ క్యాంప్‌నకు ఎంపిక చేశారు. ఈ మేరకు సెపక్‌తక్రా అసోసియేషన్‌ జిల్లా చైర్మన్‌ సప్తగిరి మల్లికార్జున ఆదివారం వెల్లడించారు. ఈ నెల 20 నుంచి థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో నిర్వహించనున్న ఇండియన్‌ క్యాంపులో మానస పాల్గొననుంది. అక్కడ ప్రతిభ కనబరిస్తే జాతీయ జట్టులో చోటు దక్కించుకుని ఢిల్లీలో నెల రోజుల శిక్షణ శిబిరంలో పాల్గొననుంది. ఇక్కడ కూడా రాణిస్తే భారత్‌ తరఫున ఆసియా గేమ్స్‌లో ప్రాతినిథ్యం వహించే అవకాశముంది. ఈ క్రమంలో మానస బ్యాంకాక్‌ వెళ్లడానికి పూర్తి ఖర్చులను స్పోర్ట్స్‌ అథారిటి ఆఫ్‌ ఇండియా, అఖిల భారత సెపక్‌తక్రా సంఘం భరించనుంది. ఆమె ఎంపికపై సెపక్‌తక్రా సంఘం ప్రెసిడెంట్‌ షాహిన్‌, పీడీలు శ్యామల, అనిత హర్షం వ్యక్తం చేశారు.

నేడు డయల్‌ యువర్‌ సీఎండీ

అనంతపురం టౌన్‌: తిరుపతిలోని ఎస్పీడీసీఎల్‌ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు ‘డయల్‌ యువర్‌ సీఎండీ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అనంతపురం విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ శేషాద్రి శేఖర్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో విద్యుత్‌ సమస్యలున్న వినియోగదారులు 89777 16661 నంబరుకు ఫోన్‌ చేయాలని సూచించారు.

వేర్వేరు ప్రాంతాల్లో..

ఇద్దరి అనుమానాస్పద మృతి

అనంతపురం సెంట్రల్‌: జిల్లా కేంద్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసులు తెలిపిన మేరకు... రాప్తాడుకు చెందిన సాకే వెంకటేష్‌ (40) ప్రస్తుతం అనంతపురం రూరల్‌ మండలం అక్కంపల్లి పంచాయతీ ఎన్‌ఆర్‌ కాలనీలో నివాసముంటున్నాడు. భార్య విడాకులు ఇవ్వడంతో తన తల్లి నారాయణమ్మతో కలసి ఉంటూ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తాగుడుకు బానిసయ్యాడు. మూర్ఛ వ్యాధితో కూడా ఇబ్బందిపడేవాడు. శనివారం బయటకు వచ్చిన అతను తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఆదివారం ఉదయం ఆదిమూర్తి నగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి వద్ద విగతజీవిగా కనిపించాడు. మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు రెండో పట్టణ సీఐ శ్రీకాంత్‌ యాదవ్‌ కేసు నమోదు చేశారు.

టీవీ టవర్‌ సమీపంలో మరొకరు..

నగరంలోని టీవీ టవర్‌ సమీపంలో నివాసముంటున్న లక్ష్మీనారాయణ (26)కు బుక్కరాయ సముద్రం మండలం బొమ్మలాటపల్లి గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహమైంది. దంపతుల మధ్య చోటు చేసుకున్న మనస్పర్థల కారణంగా గతంలో లక్ష్మీనారాయణపై హత్యాయత్నం జరిగింది. దీంతో గొంతు వద్ద వైద్యులు ఆపరేషన్‌ చేసి ఓ పరికరాన్ని అమర్చారు. రెండు రోజుల క్రితం మరోసారి గొడవ పడడంతో శనివారం వన్‌టౌన్‌ పోలీసులు స్టేషన్‌కు పిలిపించినట్లు సమాచారం. ఏమైందో తెలియదు కానీ ఆదివారం ఇంట్లోనే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. గొంతు వద్ద ఉన్న పరికరాన్ని తొలగించి ఉంది. అతనే తొలగించుకున్నాడా.. లేదా ఎవరైనా చంపే ప్రయత్నంలో తొలగించారా? అనేది తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రైలు పట్టాలపై

యువతి మృతదేహం

గుంతకల్లు: రైలు పట్టాలపై ఓ యువతి మృతదేహాన్ని జీఆర్‌పీ పోలీసులు గుర్తించారు. జీఆర్‌పీ ఏఎస్‌ఐ ప్రేమ్‌కుమార్‌ కథనం మేరకు.. గుంతకల్లు పట్టణంలోని ఆలూరు రోడ్డు సీఐటీయూ కాలనీలో నివాసముంటున్న సుజాత కుమార్తె కౌశల్య(19) ఎంఎల్‌టీ కోర్సు పూర్తి చేశారు. స్థానిక పద్మావతి నర్సింగ్‌ హోమ్‌లో పనిచేస్తున్నారు. విధులు ముగించుకుని రోజూ గుంతకల్లు – హనుమాన్‌ రైల్వేస్టేషన్‌ మార్గం దాటి ఇంటికి వెళ్తారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి బయల్దేరిన కౌశల్య రైలు పట్టాలపై విగతజీవిగా పడి ఉంది. స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో జీఆర్పీ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈమె ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మృతి చెందిందా.. లేదా ఆత్మహత్య చేసుకుందా అనే విషయాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement