20న ఉద్యోగులకు మెగా వైద్య శిబిరం
అనంతపురం అర్బన్: రెవెన్యూ, సర్వే భూరికార్డుల శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ నెల 20, 21 తేదీల్లో కలెక్టరేట్ ప్రాంగణంలో మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ వెల్లడించారు. వైద్య శిబిరం నిర్వహణపై మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో డీఆర్‌ఓ మలోలతో కలిసి వైద్యారోగ్యశాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్, ఆరోగ్య శ్రీ కో–ఆర్డినేటర్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు సమన్వయ సహకారంతో వైద్య శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు. క్యాన్సర్, దంత, నేత, నరాల బలహీనత, కిడ్నీ సమస్యలు, వెన్నెముక నొప్పులు, తదితర వ్యాధ్యులకు నిపుణులైన వైద్యులు సేవలందిస్తారన్నారు. సమావేశంలో ఆర్‌డీఓ వసంతబాబు, ఆస్పత్రి సూపరింటెండెంట్ మల్లీశ్వరి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ శంకర్, ఆరోగ్యశ్రీ కో–ఆర్డినేటర్ గంగాధర్‌రెడ్డి, కలెక్టరేట్ ఏఓ అలెగ్జాండర్, విభాగాల సూపరింటెండెంట్లు హరికుమార్, యుగేశ్వరిదేవి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దివాకర్, నాయకుడు శ్రీనివాసమూర్తి, తదితరులు పాల్గొన్నారు.


