మక్కాలో గుంతకల్లువాసి కన్నుమూత
గుంతకల్లుటౌన్: ముస్లింల అత్యంత పవిత్రమైన ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా, మదీనాల సందర్శనార్థం వెళ్లిన గుంతకల్లు పట్టణం అల్లీపీరా కాలనీకి చెందిన జైబూన్నీసాబేగం (65) మక్కాలో శనివారం మృతి చెందింది. ఈ నెల 11వ తేదీన తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లిన జైబూన్నీసా బేగం ఐదు రోజుల పాటు మక్కాను సందర్శించి ప్రార్థనలు చేసింది. శనివారం తెల్లవారుజామున నిద్రలోనే ఆమె కన్నుమూసింది. ఈ విషయాన్ని యాత్రకు వెళ్లిన బంధువులు ఫోన్ చేసి తెలియజేసినట్లు ఆమె కుమారుడు అక్రమ్ తెలిపాడు. జైబూన్నీసా భౌతిక కాయాన్ని మక్కాలోనే ఖననం చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. జైబూన్నీసా బేగం మృతి విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ యువనేత మంజునాథరెడ్డి, నాయకులు నూర్‌నిజామి, గాదిలింగేశ్వరబాబు, ఖలీల్, సుంకప్ప, మౌలా, బాసిద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


