అక్రమార్కుల్లో అలజడి
కళ్యాణదుర్గం: ఉపాధి హామీ పనుల్లో చోటు చేసుకున్న అక్రమాలపై ఉద్యోగుల్లో అలజడి మొదలైంది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 2024–25 ఏడాదికి సంబంఽధించి పూర్తయిన ఉపాధి పనులపై ప్రస్తుతం సామాజిక తనిఖీ జరుగుతోంది. అయితే తనిఖీల్లో లోపించిన పారదర్శకతపై ‘ఉత్తుత్తి తనిఖీలు’ శీర్షికన ఈ నెల 19న ‘సాక్షి’లో కథనం వెలువడడంతో జిల్లా స్థాయి ఉపాధి అధికారులు కళ్యాణదుర్గం నియోజకవర్గంపై దృష్టి సారించారు. ఎక్కడా లేని విధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అవినీతి జరిగిందంటూ సిబ్బందిపై డ్వామా పీడీ విరుచుకుపడినట్లు సమాచారం. ఈ అంశంపై రెండు రోజుల్లో విచారణ చేపట్టి వాస్తవాలు నిగ్గు తేల్చనున్నట్లు ఉద్యోగులను ఆయన హెచ్చరించినట్లు తెలిసింది. అయితే జరిగిన అవినీతిని కప్పి పుచ్చుతారా? లేక బహిర్గతం చేస్తారా? అనేది తేలాల్సి ఉంది.


