‘హీరో’ను చేస్తానని నమ్మించి మోసం | Gachibowli police cheating case Akash Kumar Verma Madhavi Sirichandana Sai Bolla ₹93.35 lakh | Sakshi
Sakshi News home page

‘హీరో’ను చేస్తానని నమ్మించి మోసం

Feb 23 2026 7:19 AM | Updated on Feb 23 2026 7:19 AM

Gachibowli police cheating case Akash Kumar Verma Madhavi Sirichandana Sai Bolla ₹93.35 lakh

గచ్చిబౌలి: సినీ హీరో చేస్తానని నమ్మించి మోసం చేసిన కేసులో పోలీసులు ఓ మహిళకు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు అందజేశారు. మరో సారి తెరపైకి వచ్చింది. తాజాగా ఓ మహిళను నిందితురాలిగా నానక్‌రాంగూడలో ఉంటూ ఐటీ ఉద్యోగిగా పని చేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆకాష్‌ కుమార్‌ వర్మకు మాధవి అలియాస్‌ సిరిచందన పరిచయమైంది. ఆమె ద్వారా పరిచయమైన సాయి బొల్లా తెలుగు సినీ పరిశ్రమలో దర్శకులతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. తన వద్ద ఓ కథ ఉందని హీరోగా అవకాశం

కల్పిస్తానని నమ్మించి సినిమా 
రిజి్రస్టేషన్‌ పేరిట 2023 నుంచి 2025 వరకు దాదాపు రూ.93.35 లక్షలు తన అకౌంట్లలోకి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నాడు. సినిమా తీయకపోగా డబ్బులు తిరిగి వ్వకపోవడంతో బాధితుడి ఫిర్యాదుతో గత అక్టోబర్‌ 6న గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు విస్తు పోయే విషయాలను కనుగొన్నారు. సాయి బొల్లా అనే వ్యక్తి మాధవి భర్తే అని గుర్తించారు. పక్కా వ్యూహం ప్రకారంమే భార్య భర్తలిద్దరూ కలిసి అకాశ్‌ కుమార్‌ వర్మను మోసగించినట్లు గుర్తించారు. మాధవిని నిందితురాలిగా పేర్కొంటూ కేసునమోదు చేశారు. రెండు రోజుల క్రితం స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చారు. వీరి చేతిలో ఇంకెవరైనా మోస పోయి ఉంటే ఫిర్యాదు చేయాలని ఇన్‌స్పెక్టర్‌ బాలరాజు సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement