సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఐదోతరగతితో పాటు 6,7,8,9 తరగతుల్లో బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీకి ఆదివారం టీజీసెట్– 2026 పరీక్ష జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 492 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. 94.93 శాతం విద్యార్థులు హాజరైనట్లు ఎస్సీ గురు కుల సొసైటీ కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ఆ తర్వాత ప్రవేశాలకు అర్హత సాధించిన విద్యా ర్థులకు సమాచారం అందించడంతో పాటు వెబ్‌సైట్‌లో వివరాలు అందుబాటులో ఉంచుతారు. మే నెలాఖరుకల్లా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. గతేడాది కూడా మే నెలాఖరు నాటికి ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేసి రికార్డు సృష్టించిన గురుకులాలు.. ఈసారి కూడా అదే వేగంతో ప్రవేశాలు పూర్తి చేయనున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే ఈ ప్రక్రియ పూర్తి కానున్నట్లు అధికారులు


