ఈత కొలనులో యువతి అనుమానాస్పద మృతి | Degree Student Vaishnavi Found Dead in Alwal Swimming Pool; Negligence Suspected | Sakshi
Sakshi News home page

ఈత కొలనులో యువతి అనుమానాస్పద మృతి

Feb 23 2026 7:09 AM | Updated on Feb 23 2026 8:10 AM

young woman in swimming pool incident

అల్వాల్‌:  ఈత నేర్చుకోవడానికి స్విమ్మింగ్‌ పూల్‌కు వెళ్లిన ఓ విద్యారి్థని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అల్వాల్‌ పోలీసులు తెలిపిన మేరకు.. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌కు చెందిన వైష్ణవి (18) అల్వాల్‌లోని లయోలా కళాశాలలో డిగ్రీ చదువుతోంది. స్థానికంగా ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటూ ఓల్డ్‌ అల్వాల్‌ లోని స్విమ్మింగ్‌ పూల్‌లో  ఈత నేర్చుకోవడానికి రోజూ సాయంత్రం వెళుతోంది. రోజు మాదిరిగా ఆదివారం సాయంత్రం వెళ్లిన వైష్ణవి ఏడు గంటల ప్రాంతంలో స్విమ్మింగ్‌ పూల్‌లో మృతి చెందింది.

 గమనించిన నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. కేవలం మూడున్నర అడుగుల లోతు ఉన్న స్విమ్మింగ్‌ పూల్‌లో యువతి మృతి చెందడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా యువతి ఒక్కతే ఉన్నట్లు గుర్తించారు.స్విమ్మింగ్‌ పూల్‌ కోచ్‌ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించినట్లు సమాచారం. ఇదే స్విమ్మింగ్‌ పూల్‌లో గతంలో ఒకరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement