కామారెడ్డిలో అలర్ట్‌.. నేడు కలెక్టర్‌ వద్దకు బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు | BJP And Congress Leaders Political Challenge In Kamareddy Updates | Sakshi
Sakshi News home page

కామారెడ్డిలో అలర్ట్‌.. నేడు కలెక్టర్‌ వద్దకు బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు

Feb 23 2026 7:32 AM | Updated on Feb 23 2026 8:12 AM

BJP And Congress Leaders Political Challenge In Kamareddy Updates

సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి పొలిటికల్‌ హైటెన్షన్‌ కొనసాగుతోంది. కామారెడ్డిలో బీజేపీ-కాంగ్రెస్‌ నేతల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే రమణారెడ్డి.. నేడు కలెక్టర్‌ వద్దకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా తాను చేసిన ఆరోపణలపై సాక్ష్యాలతో రావాలని కాంగ్రెస్‌ నేతలకు మరోసారి సవాల్‌ విసిరారు. ఆయన సవాల్‌ను కాంగ్రెస్‌ నేతలు స్వీకరించడంతో మరోసారి ఉత్కంఠ నెలకొంది.

బీజేపీ ఎమ్మెల్యే రమణారెడ్డి సవాల్‌ నేపథ్యంలో పక్కా సాక్ష్యాలతో కలెక్టర్‌ వద్దకు వెళ్లేందుకు కాంగ్రెస్‌ నేతలు సన్నద్ధమయ్యారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూములపై స్పష్టత ఇవ్వాలని అధికారులను బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో భూముల విషయంలో అవినీతి చేసినట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే ప్రకటన చేశారు. అయితే, రాజీనామాకు సిద్ధం కావాలంటూ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. నేతల సవాల్‌ నేపథ్యంలో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. ఇరు పార్టీల నేతలను కలెక్టర్ కార్యాలయానికి వెళ్లకుండా అడ్డుకుంటారా? అనే ఉత్కంఠ నెలకొంది. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement