నేడు డెస్క్‌ జర్నలిస్టుల ధర్నా | Desk Journalists Hold Statewide Protest | Sakshi
Sakshi News home page

నేడు డెస్క్‌ జర్నలిస్టుల ధర్నా

Feb 23 2026 7:54 AM | Updated on Feb 23 2026 7:54 AM

Desk Journalists Hold Statewide Protest

సాక్షి, హైదరాబాద్‌: డెస్క్‌లో పని చేస్తున్న ప్రతి సబ్‌ ఎడిటర్‌కు సర్క్యూలేషన్‌తో సంబంధం లేకుండా అక్రిడిటేషన్‌ కార్డులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట, హైదరాబాద్‌లో ఐఅండ్‌పీఆర్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్లు డీజేఎఫ్‌టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జ్యోతిబసు, మస్తాన్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

 ప్రతి జిల్లా డెస్క్‌కు  ఐదు కార్డులు ఇవ్వాలని, హైదరాబాద్‌ సిటీ డెస్క్‌కు 18, సెంట్రల్‌ డెస్క్‌కు 20, టీవీ ఛానళ్లకు ప్రస్తుతం ఉన్న 8 కార్డుల సంఖ్యను 15కు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దరఖాస్తుల ప్రక్రియను సులభతరం చేయాలని, కార్టూనిస్టుల కాలం యాడ్‌ చేసి వారికీ కార్డులు ఇవ్వాలని కోరారు. ఈ ధర్నాలకు పలు జర్నలిస్టు సంఘాలు సైతం మద్దతు తెలుపుతున్నాయన్నారు. ఉదయం 10 గంటలకు జరిగే ధర్నాల్లో ప్రతి డెస్క్‌ జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.   

Advertisement
 
Advertisement
Advertisement