Sub-Editor
-
నేడు డెస్క్ జర్నలిస్టుల ధర్నా
సాక్షి, హైదరాబాద్: డెస్క్‌లో పని చేస్తున్న ప్రతి సబ్ ఎడిటర్‌కు సర్క్యూలేషన్‌తో సంబంధం లేకుండా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట, హైదరాబాద్‌లో ఐఅండ్‌పీఆర్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్లు డీజేఎఫ్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జ్యోతిబసు, మస్తాన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి జిల్లా డెస్క్‌కు ఐదు కార్డులు ఇవ్వాలని, హైదరాబాద్ సిటీ డెస్క్‌కు 18, సెంట్రల్ డెస్క్‌కు 20, టీవీ ఛానళ్లకు ప్రస్తుతం ఉన్న 8 కార్డుల సంఖ్యను 15కు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దరఖాస్తుల ప్రక్రియను సులభతరం చేయాలని, కార్టూనిస్టుల కాలం యాడ్ చేసి వారికీ కార్డులు ఇవ్వాలని కోరారు. ఈ ధర్నాలకు పలు జర్నలిస్టు సంఘాలు సైతం మద్దతు తెలుపుతున్నాయన్నారు. ఉదయం 10 గంటలకు జరిగే ధర్నాల్లో ప్రతి డెస్క్ జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. -
రాజకీయ చతురుడు.. సాహతీ కోవిదుడు
సబ్ ఎడిటర్ నుంచి సీఎం దాకా.. భువనేశ్వర్: నలభైయేళ్లపాటు ఒడిశా రాజకీయాలను శాసించిన జేబీ పట్నాయక్ బహుముఖ ప్రజ్ఞాశాలి. మూడుసార్లు ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, గవర్నర్‌గా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆయన.. సాహిత్యం, జర్నలిజం, సాంస్కృతిక రంగంలో కూడా తనదైన ముద్ర వేశారు. రాజకీయ వారసత్వం లేకున్నా.. రాష్ట్ర కాంగ్రెస్‌లో తిరుగులేని నేతగా ఎదిగారు. 1980లో సీఎంగా పగ్గాలు చేపట్టి 1989 వరకు ఆ పదవిలో ఉన్నారు. తర్వాత 1995లో మళ్లీ సీఎంగా ఎన్నికై 1999 వరకు కొనసాగారు. 2004 నుంచి ఐదేళ్ల వరకు ఒడిశాలో విపక్ష నేతగా ఉన్నారు. 2009లో అస్సాం గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆయన 14 ఏళ్ల పాలనలో ఒడిశా అభివృద్ధి పథాన దూసుకుపోయింది. అస్సాం గవర్నర్‌గా ఉన్నప్పుడు పట్బౌసీ సత్రా ఆలయంలోని గర్భగుడిలోకి మహిళల ప్రవేశం కోసం కృషి చేశారు. ‘బంకిన్చంద్ర ఉపన్యాసమాల’ అనువాదానికిగాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. 1927లో ఖుర్దాకు దగ్గర్లోని రామేశ్వర్ వద్ద జన్మించిన పట్నాయక్ సంస్కృతంలో డిగ్రీ, రాజనీతి శాస్త్రంలో పీజీ చేశారు. ‘ఈస్టర్న్ టైమ్స్’ ఆంగ్ల పత్రికలో సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. తర్వాత ఎడిటర్ అయ్యారు. 1971లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1973-1975 మధ్య ఇందిర హయాంలో రక్షణశాఖ ఉపమంత్రిగా పనిచేశారు. 1980 వరకు రక్షణశాఖ సహాయమంత్రిగా ఉన్నారు. 1980లో మళ్లీ లోక్‌సభకు ఎన్నికై.. కేంద్రంలో మంత్రిగా పనిచేశారు.


